• వన్ మ్యాన్ కమిషన్ కి విజ్ఞప్తి చేసిన బైరి వెంకటేశం

హైదరాబాద్ : దళిత ప్రయోజనాలు పొందడంలో 78 ఏళ్లుగా అణిచివేతకు గురై దళితుల్లో అత్యంత వెనుకబడిన (MBSC)57 కులాలకు ఎస్సీ వర్గీకరణ లో 7 శాతం రిజర్వేషన్స్ కల్పించి A వర్గంలో చేర్చాలని ఎస్సీ 57 ఎంబి ఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి అన్నారు. ఈ మేరకు నేడు బి ఆర్ కె భవన్లో ఎస్సీ వర్గీకరణ పై నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమిమ్ అక్తర్ గారిని ఎంబి ఎస్సీ కులాల నాయకులతో కలిసి వినతిపత్రం అందించారు.

ఈ సందర్బంగా కమిషన్ చైర్మన్ తో 57 ఎంబి ఎస్సీ కులాల స్థితి గతులపై, ఇంతకాలం ఈ కులాలకు విద్య, ఉద్యోగ, ఉపాది, రాజకీయ పరంగా జరిగిన అన్యాయం పై సుధీర్గంగా చర్చించారు. మా కులాలను మాల మాదిగ కులాలతో కలపకుండా ప్రత్యేక కేటగిరి లో ఉంచి జనాభా దమాషా ప్రకారం కాకుండా అన్ని రంగాల్లో వెనుకబాటు తనం ఆధారంగా 7 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని, ఇప్పటివరకు కనీసం కులపత్రాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నూతన జనాభా లెక్కల ప్రకారం అన్నిరంగాల్లో వెనుకబాటు తనం ఆధారంగానే 57 కులాలకు అధికశాతం రిజర్వేషన్స్ కల్పించాలని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 57 ఎంబి ఎస్సీ కులాల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా కులాలను ఆదుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా పంబాల కులవృత్తి కళాకారులు తమ జామిడిక వాయిద్యం తో , డక్కలి కళాకారులు కిన్నెర వాయిద్యం తో పాటల రూపంలో తమ సమస్యలను కమిషన్ చైర్మన్ కి వినిపించారు.

వెనుకబడిన దళిత కులాలందరికి సామాజిక న్యాయం జరిగేలా చూస్తామని కమిషన్ చైర్మన్ హామీ ఇచ్చారన్నారు ఈ కార్యక్రమం లో నాయకులు కర్నె రామారావు డక్కలి, కురువ జయరాములు మదాసి కురువ, రాయిల లక్ష్మి నర్సయ్య చిందు, సనాధన్ మాంగ్ గారోడి,సుద్దాల కుమారస్వామి, బత్తుల పాండు పంబాల , సంపత్ గోసంగి, మల్లు ప్రసాద్ మాల దాసరి, బొబ్బిలి రమేష్ మాలజంగం, పర్శపాక శ్రీనివాస్ మాదిగ దాసు, కొలుపుల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

 

By admin