– మంత్రివర్గ ఉపసంఘం కో -చైర్మన్ దామోదర రాజనర్సింహాకు ఎస్సీ 57 ఉపకులాల నివేదికను అందజేసిన బైరి వెంకటేశం
హైదరాబాద్: దళితులల్లో సమగ్ర కుల జనగణన చేపట్టిన తరువాతే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం కోరారు. ఈమేరకు నేడు ఎస్సీ వర్గీకరణ అమలుకై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కో చైర్మన్ దామోదర రాజనర్సింహాను కలిసి ఎస్సీ ఉపకులాల సమగ్ర నివేదికను అందజేశారు.
ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నీరగొండ బుచ్చన్న, టిఎన్ స్వామి లతో కలిసి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్ళు గడిచినా నేటికీ దళితులకు అందాల్సిన ఫలాలు మాల, మాదిగలే అనుభవించారని మిగతా 57 దళిత కులాలు వెనుకబడేయబడ్డారని కాబట్టి ఎస్సీ వర్గీకరణ లో వెనుకబడిన 57 కులాలను ప్రత్యేకంగా A గ్రూపులో పెట్టి 7శాతం రిజర్వేషన్స్ కేటాయించాలని, విధి విధానాలు రూపొందించుటకు సిట్టింగ్ జడ్జ్ తో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, మా కులాల తక్షణ అభివృద్ధి కై ఎన్నికల మేనిఫెస్టో లో హామీ ఇచ్చిన విధంగా ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రగిరి సత్యనారాయణ,కర్నె రామారావు, ఉపాదే సనాధన్, కురువ బాలరాజు, సంపత్,శాఖమూరి యాదగిరి, మహేష్, రాంచంద్రయ్య, నాగరాజు, అశోక్,డాకూరి లింగయ్య, టాంటం అంబదాస్, పర్శరాములు, అంతోని సురేష్, శివభయ్య, ప్రభాకర్, కురువ బీరయ్య, సంజు, జీతలాల్, రంజిత్, నరేష్, రతిలాల్ తదితరులు పాల్గొన్నారు.