“వృక్షో రక్షతి రక్షితః” అన్న పెద్దల మాటను నిజం చేస్తూ, వనాల సంరక్షణ గురించి సమాజానికి గొప్ప సందేశమిచ్చే చిత్రం “కలివి వనం”. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రకృతి పరిరక్షణకు అద్దం పడుతుంది. రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్, శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, నాగదుర్గ కథానాయికగా పరిచయమవుతోంది. ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ నరేంద్ర రచన, దర్శకత్వం వహించారు.

గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర టీజర్‌ను మీడియా ప్రముఖులు టీ.యఫ్.జె.ఏ. ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ, వైస్ ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు జ్యూరీ సభ్యుడు లక్ష్మీ నారాయణ, సినీజోష్ సీఈవో రాంబాబు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, దుష్చర్ల సత్యనారాయణల చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు.

దుష్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, “పంచభూతాలతో పాటు చెట్టు కూడా ప్రకృతి మాత. వనాలు రక్షితే జనాలు బాగుంటారు. అభివృద్ధి పేరుతో చెట్లను నరకడం అన్యాయం. ‘కలివి వనం’ సినిమా పర్యావరణ రక్షణ గురించి అద్భుత సందేశాన్ని అందిస్తోంది. ఈ చిత్రం సమాజంలో మార్పు తీసుకొచ్చి, ప్రజల్లో చెట్ల విలువను చాటాలని కోరుకుంటున్నా,” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె మాట్లాడుతూ, “ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు రాజ్ నరేంద్ర, నిర్మాతలు మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలకు కృతజ్ఞతలు. టీజర్ కోసం నేను కంపోజ్ చేసిన సంగీతం మాట్లాడుతుంది. కాసర్ల శ్యామ్ గారు నా రిక్వెస్ట్‌పై అద్భుతమైన పాట రాశారు. ఈ చిత్రానికి నా వంతు సమర్థవంతంగా అందించే ప్రయత్నం చేశాను,” అన్నారు.

నటుడు బలగం సత్యనారాయణ మాట్లాడుతూ, “సామాజిక స్పృహతో రూపొందిన ‘కలివి వనం’ చిత్రం బలగం సినిమా తర్వాత నాకు మరో గుర్తింపును తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నా. దర్శకుడు రాజ్ గారు కావాల్సిన ఔట్‌పుట్ కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. అడవులు, గుట్టల్లో షూటింగ్ అనుభవం మరపురానిది. ప్రకృతి కోసం ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా,” అన్నారు.

నటుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ, “ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. పర్యావరణ రక్షణ లక్ష్యంతో దర్శకుడు రాజ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. ఈ టీమ్‌తో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ సినిమాలో నేను కీలక పాత్ర పోషించాను. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా ఈ చిత్రానికి రావాలని ఆకాంక్షిస్తున్నా,” అన్నారు.

లిరిక్ రైటర్ తిరుపతి మాట్ల మాట్లాడుతూ, “దర్శకుడు రాజ్ నరేంద్ర ఎన్నో ఏళ్లుగా తన ప్రతిభను యూట్యూబ్, ఇతర మాధ్యమాల ద్వారా చాటుతున్నారు. ‘కలివి వనం’తో ప్రకృతి గురించి తన దృష్టిని పెద్ద తెరపై చూపిస్తున్నారు. ఈ చిత్రంలో సాహిత్యం అందించే అవకాశం రావడం సంతోషంగా ఉంది,” అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ మాట్లాడుతూ, “ప్రకృతిని కాపాడుకోవాలనే గొప్ప లక్ష్యంతో ‘కలివి వనం’ సినిమాను రూపొందించిన దర్శకుడు రాజ్ నరేంద్రను అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నంతో పర్యావరణ రక్షణకు కృషి చేయాలి. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభించాలని కోరుకుంటున్నా,” అన్నారు.

నటుడు ఖయ్యూం మాట్లాడుతూ, “రాజ్ నరేంద్ర నా మొదటి హీరో. 12 ఏళ్లుగా మేము స్నేహితులం. ‘కలివి వనం’ వంటి సినిమా రూపొందించడం రాజ్‌కే సాధ్యం. ఈ చిత్రం ఆర్గానిక్ మూవీగా, యాక్షన్, రొమాన్స్‌లను మించి ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా,” అన్నారు.

నిర్మాత మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, “నాకు చెట్లంటే ఇష్టం. అందుకే ఈ సినిమాను నిర్మించాను. ఒక చిన్న ఆలోచనగా మొదలైన ‘కలివి వనం’ ఈ రోజు ఇంత గొప్పగా ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. టీజర్ లాంఛ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు,” అన్నారు.

నిర్మాత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, “మా టీజర్ లాంఛ్‌కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రానికి కష్టపడిన నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ సినిమా సాకారమైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా టీమ్ తరపున శుభాకాంక్షలు,” అన్నారు.

నటి నాగ దుర్గ మాట్లాడుతూ, “పర్యావరణ రక్షణ సందేశమిచ్చే ‘కలివి వనం’లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. దర్శకుడు రాజ్, నిర్మాతలు మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలకు కృతజ్ఞతలు. వారి సహకారం వల్లే ఈ చిత్రం రూపుదిద్దుకుంది,” అన్నారు.

నటి బలగం విజయలక్ష్మి మాట్లాడుతూ, “వనాలను కాపాడుకోవాలనే సందేశంతో ఈ సినిమా రూపొందింది. నాకు కీలక పాత్ర ఇచ్చిన దర్శకుడు రాజ్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా సందేశాన్ని అందరూ ఆచరించి చెట్లను కాపాడాలని కోరుకుంటున్నా,” అన్నారు.

దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ, “టీజర్ లాంఛ్‌కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ‘కలివి వనం’ కమర్షియల్ చిత్రమే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడాల్సిన సినిమా. చెట్ల వల్లే వర్షం వస్తుందని బాల్యం నుంచి పిల్లలకు నేర్పాలి. ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య, 70 ఎకరాల్లో అడవిని సృష్టించిన దుష్చర్ల సత్యనారాయణ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించాను,” అన్నారు.

నటీనటులు: రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, నాగ దుర్గ, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్, శ్రీ చరణ్, అశోక్

సాంకేతిక నిపుణులు

బ్యానర్: ఏఆర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి
రచన, దర్శకత్వం: రాజ్ నరేంద్ర
సినిమాటోగ్రాఫర్: జియల్ బాబు
సంగీతం: మదీన్ ఎస్.కె
ఎడిటర్: చంద్రమౌళి
మాటలు: కోటగల్లి కిషోర్
పాటలు: కాసర్ల శ్యామ్, తిరుపతి మాట్ల, కమల్ ఇస్లావత్
పీఆర్ఓ: శ్రీధర్ (స్టూడియో వన్)

 

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *