– ద‌య్యాల అశోక్
దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నటుడిగా రీ-ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్). మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాణంలో, పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ సినిమా తెరకెక్కింది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ రోజు ఏప్రిల్ 4న విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

క‌థ‌:
కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం, తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం అనే పాయింట్ తో ‘లైఫ్’ (LYF – లవ్ యువర్ ఫాదర్) సినిమా తెరకెక్కింది. తండ్రి కిషోర్ (ఎస్పీ చరణ్) కొడుకు శ్రీహర్షను ఎంతో ప్రేమ‌గా పెంచుతాడు. కిషోర్ మంచి త‌నానికి సొసైటీ మంచి పేరుంటుంది. ఈ క్ర‌మంలో క‌బీర్‌తో గొడ‌వ జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో కిషోర్‌ను చంపేస్తారు. తండ్రి చ‌నిపోయిన త‌ర్వాత కూడా కొడుకు కోసం తండ్రి ఎలాంటి స‌హాయం చేస్తాడు? ఈ క్ర‌మంలో శివతత్వం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుంది? క‌బీర్ మోసాల‌కు చ‌మ‌ర‌గీతం పాడుతారా? అనేది చూడాలంటే థియేట‌ర్‌కు వెళ్లాల్సిందే.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:
హీరో తండ్రి కిషోర్ పాత్రలో నటించిన ఎస్పీ చరణ్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. తండ్రి అంటే ఇలాగే ఉండాల‌ని కోరుకునే విధంగా న‌టించారు. ఇక‌ కొడుకు పాత్రలో శ్రీహర్ష స్టూడెంట్‌గా చ‌క్క‌గా కుదిరాడు. న‌ట‌న‌లో, డాన్స్‌లో, ఫైట్స్‌లో టాలెంట్ చూపించాడు. హీరోయిన్ కషిక కపూర్ గ్లామ‌ర్ ఆండ్ ఫ‌ర్మార్మెన్స్ యూత్‌కు తెగ న‌చ్చుతుంద‌ని చెప్పొచ్చు. షకలక శంకర్ క‌మెడీ హాయిగా న‌వ్విస్తుంది. మిగ‌తా పాత్ర‌ల్లో నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, త‌దిత‌రులు త‌మ పాత్ర‌లకు త‌గ్గ న‌టించి మెప్పించారు.

సాంకేతిక విభాగం:
టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. పాట‌లు, వాటి చిత్రీక‌ర‌ణ కూడా సినిమా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. క్లైమాక్స్ ఉత్కంఠ పెంచే విధంగా ఉంది. సినిమా రిచ్‌గా క‌నిపించ‌డంలో మూవీ మేక‌ర్స్ ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కాలేద‌ని సినిమా చూస్తే తెలుస్తుంది.

విశ్లేష‌ణ‌:
దైవత్వంతో పాటు తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపించారు. కథ కాశీ, గోవా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సినిమాలో శివతత్వాన్ని కూడా చూపించారు. అనుకున్న సబ్జెక్టును తెర‌పై ఫ‌ర్‌ఫెక్ట్‌గా చిత్రీక‌రించ‌డంలో పవన్ కేతరాజు విజ‌యం సాధించార‌నే చెప్పొచ్చు. క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్.. ప్ర‌తి దానిలో ఆయ‌న టాలెంట్ క‌నిపిస్తుంది. భ‌విష్య‌త్‌లో స్టార్ డైరెక్ట‌ర్‌గా ఎదిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఈ సినిమా మేకింగ్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ఫైన‌ల్‌గా..
మ‌న చేతిలో ఏమి ఉండ‌దు.. ఫైన‌ల్‌గా శివుడి ఆజ్ఞతోనే అన్నీ జ‌రుగుతాయి.. అని చెప్పిన ఈ సినిమా చూడాలంటే కూడా శివాజ్ఞ ఉంటుంది. సో.. ఫ్యామిలీతో క‌లిసి థియేట‌ర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా ఇది.

రేటింగ్: 3.5 / 5

 

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *