డల్లాస్‌: టాలీవుడ్‌లో మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను వంటి సూపర్ హిట్ సినిమాలు తెర‌కెక్కించి తన ప్రత్యేకతను చాటుకున్న ద‌ర్శ‌కుడు వీఎన్‌ ఆదిత్య. ఇటీవ‌ల‌ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు వీఎన్‌ ఆదిత్య. ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే వీఎన్‌ ఆదిత్య సినిమాలకు సంబంధించి మరో కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. త్వరలోనే వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతుంది. ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా.. వీఎన్‌ ఆదిత్య డైరెక్షన్‌లో సినిమా రాబోతొంది. ఈ మేరకు జూలై 7న‌ అమెరికాలో ఈ సినిమాను చిత్ర‌యూనిట్ స‌భ్యులు ప్ర‌క‌టించారు. టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న‌ డల్లాస్ నగరంలో లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో కొత్త సినిమాపై ప్రకటన చేశారు. వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో వచ్చే ఈ కొత్త మూవీ నిర్మాణం డల్లాస్‌లో జరగనుందని.. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్తుందని మేకర్స్‌ తెలిపారు. అయితే సినిమాకు సంబంధించి తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయుల‌తోపాటు.. విదేశీయులు అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, ఇండియన్స్‌.. మరీ ముఖ్యంగా తమిళ్‌, కన్నడ, తెలుగు వారు భారీ సంఖ్యలో ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతూ.. ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. వ‌చ్చిన స్పంద‌న‌పై దర్శకుడు వీఎన్‌ ఆదిత్య హర్షం వ్యక్తం చేశారు. వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతుందని తెలియడంతో ఆయన అభిమానులు మాత్రమే కాక మూవీ లవర్స్‌ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్‌ గుడ్‌ మూవీస్‌కు కేరాఫ్‌ అడ్రెస్‌ వీఎన్‌ ఆదిత్య డైరెక్షన్‌లో సినిమా అంటే.. కచ్చితంగా సెన్సిటివ్ ఎమోష‌న్స్‌కు పెద్దపీట వేస్తారు. దేశం కాని దేశంలో ఓ తెలుగు సినిమా ఆడిషన్ కి ఇంతటి స్పంద‌న రావడానికి కూడా ఇదే కారణం. మరి.. ఈ అంచనాలకు త‌గ్గ‌ట్టే వీఎన్ ఆదిత్య ఎలాంటి స‌బ్జెక్టును తెర‌కెక్కిస్తారో అనే విష‌య‌మే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్.

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి, సజిత నాయుడు తిరుమల శెట్టికి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ కి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ కి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసంకి, తన వ్యాఖ్యానంతో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండికి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శాస్త్రి అనిపిండి ధన్యవాదాలు తెలిపారు.

By admin