వెంకటాపూర్, ములుగు: భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు సమీపంలో, 163వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ములుగు జిల్లా కేంద్రంలోని ఇంచర్ల సమీపంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల పామాయిల్ సాగు గణనీయంగా పెరిగింది. ములుగు జిల్లాలోనే 763 మంది రైతులు 2,648 ఎకరాల్లో పామాయిల్ పంటను సాగు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానిక రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరనుందని డీఎన్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దొడ్డ ప్రతాప్ రెడ్డి, వ్యవసాయ నిపుణుడు దొడ్డ సాంబారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టు విజయవంతంగా రూపుదిద్దుకోవడంలో కీలక పాత్ర పోషించిన కేఎన్ బయోసైన్స్ సుధారెడ్డి, డీఎన్ఆర్ ట్రస్ట్ వాలంటీర్లు, జర్నలిస్టు నరేష్‌లకు డీఎన్ఆర్ ట్రస్ట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఈ సాధన సాకారమైందని వారు పేర్కొన్నారు.

ఈ ఫ్యాక్టరీ కోసం ములుగు మండలం ఇంచర్ల సమీపంలో 12 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ విధానం రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనమని డీఎన్ఆర్ ట్రస్ట్ అభివర్ణించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ములుగు జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు డీఎన్ఆర్ ట్రస్ట్ కృతజ్ఞతలు తెలియజేసింది.

ఈ పామాయిల్ ఫ్యాక్టరీ స్థానిక రైతులకు ఆర్థిక ఉపాధి కల్పించడమే కాకుండా, లాభ‌దాయ‌మైన‌ వ్యవసాయానికి దోహ‌ద‌ప‌డుతుంది.

 

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *