హైదరాబాద్ | పెద్దఅంబర్‌పేట, మార్చి 4: స్కూల్‌కు బొట్టుపెట్టుకుని వచ్చాడని విద్యార్థి పట్ల ప్రిన్సిపల్ కర్కశంగా వ్యవహరించాడు. ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదాడు. అనంతరం బాత్‌రూంలోకి తీసుకెళ్లి బొట్టుపోయేలా ముఖం కడిగించాడు. హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్ద అంబర్‌పేటలోని క్యాండర్ ష్రైన్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సోమవారం నాడు బొట్టుపెట్టుకుని పాఠశాలకు వెళ్లాడు. ఉదయం ప్రతిజ్ఞ కాగానే.. సదరు విద్యార్థిని గమనించిన ప్రిన్సిపల్ లక్ష్మయ్య తన రూమ్‌కి పిలిపించుకున్నాడు. స్కూల్‌కు ఎందుకు బొట్టు పెట్టుకుని వచ్చావని నిలదీశాడు. కోపంతో విద్యార్థిని చితకబాదాడు. అనంతరం బాత్‌రూంలోకి తీసుకెళ్లి బొట్టు పోయేలా ముఖం కడిగించాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన విద్యార్థిని.. సాయంత్రం ఇంటికెళ్లగానే తల్లిదండ్రులకు జరిగింది మొత్తం చెప్పాడు.
ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు విద్యార్థి తల్లిదండ్రులు మంగళవారం ఉదయం స్కూల్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న హిందూవాహిని సభ్యులు కూడా పాఠశాల వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. బొట్టు పెట్టుకున్నాడనే కారణంతో విద్యార్థిని ఎలా కొడతారని నిలదీశారు. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ వచ్చేవరకు ఆందోళన ఆపేదిలేదని పాఠశాల ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు.
ఈ ఘటనపై స్పందించిన పాఠశాల యాజమాన్యం విద్యార్థిపై చేయిచేసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. మరోసారి ఈ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, హిందూ వాహిని సభ్యులు హెచ్చరించారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
