– గాజర్ల రంజిత్ (దుబాయ్ నుంచి రిపోర్టింగ్)
దుబాయ్: తెలంగాణ పల్లెల్లో ఇంటింటా కొలువై ఉన్న ఇల వేలుపు రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ విదేశీ గడ్డపై తొలిసారిగా జరిగింది. శ్రీ రేణుకా ఎల్లమ్మ యూఏఈ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ఫోక్ సింగర్ లల్లయిలే మహేష్ పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇది గొప్ప విషయం అని , మన సంస్కృతిని కాపాడేందుకు మీ సంకల్పం, కృషి అభినదనీయమని హాజరైన పలు సంఘాల వ్యవస్థాపకులు నిర్వహకులను ప్రశంసించారు.
దాదాపు 12 వందల మంది హాజరైన ఈ కార్యక్రమంలో ఒగ్గు కళాకారుల లగ్గం పట్నం, నాగవెల్లి పట్నం, పూజ విధానాలు తెలంగాణ పల్లెల్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. పల్లె ప్రకృతి, ఎల్లమ్మ చరిత్ర కు తగ్గట్టు కట్ ఔట్ లతో స్పార్క్ మీడియా అరుణ్ సుర్నిడ స్థలాన్ని చక్కగా అలంకరిచారు. వచ్చిన భక్తులు అందరికి అన్నదానం చేశారు, స్వయంగా గ్రూపు సభ్యులు వంటలు చేశారు. దుబాయ్ లో మొట్ట మొదటి సారి జరిగిన ఎల్లమ్మ బోనాలు పండుగకు మా కంపనీ సంపంగి గ్రూపు టైటిల్ స్పాన్సర్ గా ఉండడం మా అదృష్టం అని అందుకు మమ్మల్ని సంప్రదించిన వ్యక్తి మల్లేష్ కోరేపుకి కృతజ్ఞతలు తెలిపారు సంపంగి అధినేత రమేష్.
ఈ కార్యక్రమం విజయవంతం కావాడానికి విరాళాలు అందించిన వారితో పాటు ప్రతి పనిలో తోడుగా ఉన్న సంజీవ్ బత్తిని, రాజశేఖర్ పల్లి, వన్నెల భూమేష్, అరుణ్, లావణ్య, భూమేష్, శేఖర్లను సన్మానించినట్టు మల్లేష్ కోరేపు తెలిపారు..
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
![BREAKING NOW](https://breakingnewstv.co.in/wp-content/uploads/2022/06/B-APP-AD-copy.jpg)