సౌదీ అరేబియాలోని దమ్మం ప్రాంతములో సాటా సంక్రాంతి వేడుకలు కన్నుల పండవగా జరిగాయి వరసగా 3వ సారి, ఈ మెగా ఈవెంట్ ను సాటా అధ్యక్షుడు మన్యం జిల్లా, రావుపల్లి గ్రామానికి చెందిన పళ్లెం తేజేశ్వర రావు నాయకత్వంలో, ఈవెంట్ డైరెక్టర్ గా వైజాగ్ చెందిన రాకేష్ బగ్గం, కాకినాడకు చెందిన వైస్ ప్రెసెడెంట్ కిషోర్ గురుజు, మహిళా ప్రెసిడెంట్ సంధ్య గౌరీశంకర్ అంకాబత్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
సౌదీ అరేబియాలోని తెలుగు వారందరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి అంటూ అతిథులు కొనియాడారు.
ఈ సంబరాల్లో ముగ్గుల పోటీలు, రింగ్ గేమ్స్, బెలూన్ షూటింగ్, 30 పైగా లక్కీ డ్రా గిఫ్ట్స్ 4 బంగారం కాయిన్స్, బ్యాగ్స్, ఫ్లైట్ టికెట్, ప్రతి సభ్యునికి విజయవాడ ప్రాంతంలోని కొండపల్లి నుంచి తెచ్చిన బొంగరాలు రిటర్న్ గిఫ్ట్స్ అందించారు. తెలుగు వారి రుచికరమైన వంటకాలను వండి బంతి భోజనాలు పద్దతిలో అరటి ఆకు మీద పెట్టి వడ్డించారు.
రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు వర ప్రసాద్, జగదీష్ పలపాల, దాసరి సూర్య నారాయణ, శ్రావణ్, పెమ్మది దిలీప్ కుమార్, పలపాల లోకేష్ పర్యవేక్షించారు. భోజన ఏర్పాట్లు మేడిబోయిన తారకేశ్వర రావు, సలదుల పవన్ కుమార్, రవి చంద్ర కొరుప్రోలు, రాంబాబు ఆధ్వర్యంలో జరిగాయి. అద్భుతమైన యాంకర్స్ గా శిల్ప ఫణేంద్ర, గౌరీ శంకర్, రమ్య అవినాష్, దివ్య సనాదుల, విజయ లక్ష్మి గురుజు, ప్రవీణ పట్నాయక్, తారక్ ప్రోగ్రాంని ఆసాంతము ఆసక్తిగా నిర్వహించారు.
మ్యూజిక్ అండ్ లైటింగ్ సిస్టంను లక్ష్మణ్, రామకృష్ణ నిర్వహించారు. సొంత ఊరు గుర్తుకువచ్చేలా అందమైన లొకేషన్ ను సతీష్ దేవర, కుసుమాంజలి, విశాల్, పవిత్ర దంపతులు, ఓం ప్రకాష్ జయశ్రీ దంపతులు, శ్రావణ్ కవిత దంపతులు, మల్లేష్, రాజేష్ తీర్చిదిద్దారు.
భరత్ నిర్వహించిన లక్కీ డ్రా ప్రోగ్రాం, కాయల సంతోషి, పలపాల భాగ్యలక్మీ , భాగ్యశ్రీ నిర్వహించిన ముగ్గుల పోటీలు, “ఆహార వృధా”పై అవగాహనా కోసం పోస్టర్ కంపెటేషన్ నిర్వహించిన నవ్య శ్రీనివాస్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించిన శిల్ప రవి చంద్ర, చాలా అద్భుతమైన బహుమతులు ఏర్పాటు చేసిన అవినాష్ ఐనాల, కల్చరల్ ఈవెంట్స్ కలర్ఫుల్ గా దివ్య సలాదుల చూసుకున్నారు. మార్కెటింగ్ విభాగములో జగన్ శశి దంపతులు సేవలు అందించారు. రమేష్, సత్యం నాయుడు, దూర ప్రాంతాల వారికీ ట్రావెల్ సపోర్ట్ చేసిన లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, అద్భుమైన గేమ్స్ నిర్వహించిన పార్థసారధి, ఉమెన్స్ వాలంటీర్స ఏర్పాట్లు చూసుకున్న సౌజన్య దిలీప్, రాజేంద్ర, మనోహర్, కేశవ సుబ్రహ్మణ్యం, సతీష్, ఉదయ్, సురేష్ నాయుడు, నవీన్ కుమార్, రామిరెడ్డి, మోహన్, మహేష్ కేపీ సహకారం అందించారు.
శ్రీమతి లీల అరవింద్ డైరేక్షన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రదర్శన ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. వెంకటేశ్వర స్వామిగా వర్షిత, పద్మ దేవిగా నేహాశ్రీ పిరటి, గోదా దేవిగా ప్రవీణ పట్నాయక్ అద్భుతమైన నటన కనబరిచారు. మన పురాతన ఆట పాట కోలాటాన్ని 2 నెలలు పాటు ప్రాక్టీస్ చేసి 20 పైగా మహిళాలతో సంధ్య శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన, అద్భుతమైన క్లాసికల్ డాన్స్ చేసిన చిన్నారి షన్విత లక్షి ఆకట్టుకున్నారు.
ఈ వేడుకలో, సంస్కృతి సంప్రదాయాలను కాపాడే వారికీ, తెలుగు వారికి ఉద్యోగాలు కల్పించిన వారికీ ప్రముఖంగా ఫౌండర్ మల్లేష్ కి, సంధ్య గౌరీ శంకర్ కి, ఆకుల శ్రీనివాస్ పటేల్ కి, అవినాష్ ఐనాలకి, రాధా సురేష్ నాయుడు దంపతులకు, విజయ కుమార్ ఎతుకూరికి, మహమ్మద్ షఫీకి సన్మానం చేశారు.
సాటా అధ్యక్షుడు తేజ, సాటా వ్యవస్థాపకుడు మల్లేశం మాట్లాడుతూ.. ఈ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
సంక్రాంతి అంటే సాటా సంక్రాంతి అనే పేరు మరోసారి సార్థకత సాధించింది. ఈ విజయానికి కారణమైన కోర్, ఆర్గనైజింగ్ టీంను సాటా ప్రత్యేకంగా అభినందించింది. మిత్రుల సహకారంతో ఈ హ్యాట్రిక్ విజయాన్ని సాధించామని వారు ఆనందం వ్యక్తం చేశారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
