వరంగల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (వరంగల్ వెస్ట్) నందు సావిత్రిబాయి పూలే 194 వ జన్మదినం సందర్భంగా సావిత్రిబాయి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గురించి వారి జీవిత విశేషాలను వివరించారు. అలాగే కళాశాల అధ్యాపకులు డాక్టర్ సాంబలక్ష్మి మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం ఏ విధంగా కృషి చేశారో వివరించారు. సావిత్రిబాయి అడుగుజాడల్లో నడవాలని డాక్టర్ రాధిక విద్యార్థులకు సూచించారు.
అలాగే వైస్ ప్రిన్సిపల్ మాలతి మాట్లాడుతూ.. విద్యార్థులు సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోలి శ్రీలత మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలను ఓర్చుకొని నిస్వార్థ సేవ చేసి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే ఉండడం మనకు గర్వకారణం అని, అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా (3 జనవరి)మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించడం ఎంతో సంతోషరమన్నారు. అలాగే రామకృష్ణ పరమహంస వంటి నిరంతర సామాజిక సేవాభావం కలిగిన మహానుభావులు చెప్పినటువంటి సమదృష్టి గురించి కొన్ని కథలను విద్యార్థులకు వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సీనియర్ ఫ్యాకల్టీ భద్రకాళి, డాక్టర్ జక్కె పద్మ, జ్యోతి డాక్టర్ సాంబలక్ష్మి, డాక్టర్ రాధిక, డాక్టర్ విమల విద్యార్థులు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోలి శ్రీలత ఒక ప్రకటనలో తెలియజేశారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
