హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
తెలంగాణ యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యంగ్ లీడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు టి.జి.జయంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత ఆత్మబలిదానాలను స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపదుతున్నామని తెలిపారు.గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి లుంబిని పార్క్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ యంగ్ లీడర్స్ రాష్ట్రంలో యూత్ కమీషన్ ఏర్పాటు చేయడం కోసం పోరాటం చేస్తుందని అన్నారు. యూత్ కమీషన్ ఏర్పాటు కోసం త్వరలో అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామని అన్నారు.

జూన్ 2 న నిర్వహించనున్న తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యంగ్ లీడర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ నేత, జనరల్ సెక్రటరీ శ్రవణ్, వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ గౌడ్, జంగిలి సవీన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంటా విజయ్ కుమార్, గంటా శ్రుతి,సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు చింతకింది చంద్రశేఖర్, విజయానంద్, విష్ణు కిషోర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

By admin