మన తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (TTA) అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది బాధ్యతలు స్వీకరించారు. 2025 – 2026 సంవత్సరాల పదవీకాలానికి కొత్తగా ఎన్నికైన బోర్డ్‌ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్‌ పైళ్ళ మల్లారెడ్డి, సలహా మండలి చైర్మన్‌ డాక్టర్‌ విజయపాల్‌ రెడ్డి, కో-ఛైర్మన్‌ డాక్టర్‌ మోహన్‌ రెడ్డి పాటలోల్ల, సభ్యుడు భరత్‌ రెడ్డి మాదాది, అధ్యక్షుడు నవీన్‌ రెడ్డి మల్లిపెద్ది, మాజీ అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

బోర్డ్‌ సభ్యులుగా నవీన్‌ రెడ్డి మల్లిపెద్ది, డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి, కవితా రెడ్డి, సహోదర్‌ పెద్దిరెడ్డి, డా. దివాకర్‌ జంధ్యం, శివారెడ్డి కొల్ల, మనోహర్‌ బొడ్కె, ప్రదీప్‌ మెట్టు, సురేశ్‌ రెడ్డి వెంకన్నగరి, నిశాంత్‌ సిరికొండ, అమిత్‌ రెడ్డి సురకంటి, గణేశ్‌ మాధవ్‌ వీరమనేని, స్వాతి చెన్నూరి, ఉషారెడ్డి మన్నం, సంతోష్‌ గంటారం, నరసింహ పెరుక, కార్తిక్‌ నిమ్మల, శ్రీకాంత్‌ రెడ్డి గాలి, అభిలాష్‌ రెడ్డి ముదిరెడ్డి, మయూర్‌ బండారు, రంజిత్‌ క్యాతం, అరుణ్‌ రెడ్డి అర్కల, రఘునందన్‌ రెడ్డి అలుగుబెల్లి, దిలీప్‌ వాస, ప్రదీప్‌ బొద్దు, ప్రభాకర్‌ మదుపాటి, నరేంద్ర దేవరపల్లి, ప్రవీణ్‌ సామల, ప్రవీణ్‌ చింట, నరేశ్‌ బైనగరి, వెంకట్‌ అన్నపరెడ్డి కొత్తగా బోర్డ్‌ సభ్యులుగా నియమితులయ్యారు.

స్ఫూర్తిదాయ‌క ప‌య‌నం

సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామాన్యునిగా ఎదిగిన నవీన్ రెడ్డి మల్లిపెద్ది ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. రంగారెడ్డి జిల్లా సింగారం అనే చిన్న పల్లెటూరికి చెందిన హనుమంత్ రెడ్డి మల్లిపెద్ది, జయప్రద దంపతులకి జన్మించిన నవీన్ రెడ్డి విద్యతోనే మన రాత మారుతుందని, మన భవితని మనమే నిర్ణయించుకోవచ్చని, నిర్దేశించుకోవచ్చని బలంగా నమ్మి ఉన్నత విద్యను అభ్యసించారు. కర్ణాటకలోని గుల్భర్గ లో మాస్టర్స్ పూర్తిచేసిన అయన ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లారు. అకుంఠిత దీక్ష, ఎనలేని పట్టుదల ఆయన్ని అనతికాలంలోనే అత్యన్నత శిఖరాలకు చేర్చాయి. సామాన్యుడు సైతం పట్టుదలతో చేస్తే సమరం దక్కుతుంది, మనం అనుకున్న విజయం అని చేతల్లో చూపించిన నిత్యకృషీవలుడు నవీన్ రెడ్డి. ఉద్యోగిగా అమెరికాలో అడుగుపెట్టి . కన్సల్టింగ్ కంపెనీలు, మీడియా, రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్ల తో పాటు అనేక ఇతర వ్యాపారాలకు అధినేతగా ఉంటూ…అనితరసాధ్యమైన విజయాల్ని అందుకున్నారు. ఆయన వ్యాపారాలన్నీ ఒక ఎత్తు అయితే యోయో మీడియా మరో ఎత్తు. తెలంగాణ గళాన్ని వినిపిస్తూ.. మన కళలు, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. యోయోని అగ్రగామి డిజిటల్ మీడియాగా మార్చడంలో ఆయన కృషి ప్రత్యేకమైనది . ఓ పక్క వ్యాపార రంగంలో రాణిస్తూనే.. మరోపక్క సేవలతోను తన దాతృత్వాన్ని ఘనంగా చాటుకున్నారు. మనం ఎంత సంపాదించాం అనేది కాదు సమాజానికి ఏమిచ్చాము.. మనం పుట్టిన ప్రాంతానికి ఏమి చేశాము. మనతోటివారికి ఏమి సాయం చేశాము అని అనునిత్యం ఆలోచించే నవీన్ రెడ్డి గారి సేవలు ఎనలేనివి ..వెలకట్టలేనివి ..అలాంటి మహోన్నత వ్యక్తిత్వం గల నవీన్ రెడ్డి గారు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం మనందరికీ గర్వకారణం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప లక్షణం నవీన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నిలుపుతుంది. స్నేహానికి అసలైన అర్ధంగా నిలిచే నవీన్ రెడ్డి గారు.. అందర్నీ కలుపుకుపోయి.. సంస్థని అత్యున్నత శిఖరాలకు చేర్చే అసలైన లీడర్ అని చెప్పవచ్చు. చెదరని చిరునవ్వుతో.. అందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ.. మనిషి రూపంలో నడిచే మానవత్వంగా తోటివారు కొనియాడే నవీన్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ సేవలు మరింత మందికి చేరువ అవుతాయని.. అసోషియేషన్ మరింత ఉన్నతంగా ఎదుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రజల్లో ఎంత ప్రభావం చూపగల పది మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్స్ తో తెలుగు డిజిటల్ రంగంలోచరిత్ర సృష్టించిన యోయో సిఇవో గా ఉన్న నవీన్ రెడ్డి యోయో ద్వారా అసోషియేషన్ సేవలని తెలంగాణాలో సామాన్యులకి సైతం చేరువచేయగలరు .. రెండున్నర దశాబ్దాలుగా అమెరికాలో అంచలంచలుగా ఎదిగిన నవీన్ రెడ్డి సారథ్యంలో సేవలు మరింత విస్తరించాలని, మనమంత ఏకమై నడుద్దామ‌ని, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ ని అత్యున్నత శిఖరాలపై నిలబెడదామ‌ని టీటీఏ స‌భ్యులంతా ఆకాంక్షిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *