▪️ కాంగ్రెస్‌కు 42% నుంచి 46% ఓట్లు
▪️ బీఆర్ఎస్‌కు 34% – 38% ఓట్లు
▪️ బీజేపీకి 12% – 16% ఓట్లు
▪️ ఇతరులకు 04% – 08% ఓట్లు
▪️ ‘గేమ్ ఛేంజర్’ సర్వే రిపోర్ట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో, ప్రముఖ పొలిటికల్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘గేమ్ ఛేంజర్ – మీడియా బాస్ నెట్‌వర్క్’ నిర్వహించిన తాజా సర్వే సంచలన విషయాన్ని వెల్లడించింది.
సర్వే అంచనా ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 8% నుండి 12% ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచే అవకాశం ఉంది. సర్వే ప్రామాణికత, విశ్లేషణ’గేమ్ ఛేంజర్ – మీడియా బాస్ నెట్‌వర్క్’ సంస్థ ప్రతినిధులు ఈ సర్వే నిర్వహణ పద్ధతిని వివరిస్తూ, ఈ ఫలితాలు కేవలం ఉపఎన్నిక దిశను మాత్రమే కాకుండా, నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను కూడా స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు కేవలం వారం రోజుల్లో 6,200 మంది ఓటర్ల అభిప్రాయాలను లోతుగా సేకరించారు. సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని అన్ని ప్రాంతాలు, వివిధ వృత్తి వర్గాల నుంచి డేటాను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఫలితాలలో కచ్చితత్వం సాధించారని వారు పేర్కొన్నారు. మొత్తం మీద, ఈ సర్వే రిపోర్టు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోరులో కాంగ్రెస్ ముందంజలో ఉందని, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వడంలో వెనుకబడ్డారని సూచిస్తోంది.
