మిల్వాకీ: అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు – భద్రత, మానసిక ఆరోగ్యం, ఇమ్మిగ్రేషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలు వంటి వాటిని ఎదుర్కొనేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) సంస్థ ఆధ్వ‌ర్యంలో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీలో విద్యార్థుల‌కు సమగ్ర దిశానిర్దేశ కార్య‌క్ర‌మం (comprehensive Student Orientation Program) నిర్వహించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆల్మా మాటర్‌గా పేరుగాంచిన ఈ విశ్వవిద్యాలయంలో వివిధ భారతీయ విద్యార్థి సంస్థలతో కలిసి ‘ఆటా’ ఈ కార్యక్రమం నిర్వహించింది. అమెరికాలో జీవనం, చదువు విషయాల్లో మార్గదర్శకత్వం, వనరులు, మెంటర్‌షిప్ అందించడం లక్ష్యంగా ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగింది. విద్యార్థుల‌తో పోలీసు అధికారులు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు, కెరీర్ కౌన్సెలర్లు, బీమా నిపుణులు, స‌క్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్లు నుంచి ప్రముఖులు మాట్లాడారు.

యూడబ్ల్యూ-మిల్వాకీ పోలీసు డిపార్ట్‌మెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ బ్రయన్ స్విటాలా, పోలీసు లెఫ్టినెంట్ అలెగ్జాండర్ ఈవెండ్ భద్రతా ప‌రమైన‌ స‌ల‌హాలు అందించారు. అత్యవసర పరిస్థితుల్లో విశ్వవిద్యాలయం, స్థానిక వనరులను ఎలా ఉపయోగించాలో వివరించారు. విద్యార్థులు సాంస్కృతిక కలిసి నవల్ల విస్తృత దృక్పథం పెంచుకోవాలని, గ్లోబల్ సక్సెస్ కోసం కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ అభివృద్ధి చేయాలని ఎకనామిక్స్ ఎమరిటస్ ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణజిత్ ఎస్. అరోరా సూచించారు.

టెక్ ఎంటర్‌ప్రెన్యూర్, వెంచర్ ఇన్వెస్టర్ రవి రెడ్డి (సీఈఓ), స్ప్లాష్‌బీఐ (SplashBI) కో-ఫౌండర్, ప్రెసిడెంట్, ఆర్కిటెక్ట్ కిరణ్ పశాం, ఎంటర్‌ప్రెన్యూర్ కెకె రెడ్డి ఇంటర్న్‌షిప్‌లు సంపాదించడం, నెట్‌వర్కింగ్, టెక్నాలజీ, సంబంధిత రంగాల్లో కెరీర్ బిల్డింగ్‌పై అంతర్దృష్టులు అందించారు. ఇక‌ సోమిరెడ్డి లా ఫర్మ్, ప్రశాంతి రెడ్డి లా ఆఫీసెస్ న్యాయవాదులు సిపిటి, ఓపిటి నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ కంప్లయన్స్, ఇటీవలి సవాళ్లపై మార్గదర్శకత్వం అందించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బీమా నిపుణుడు కృష్ణ రంగరాజు అంతర్జాతీయ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆరోగ్య, లైఫ్ ఇన్సూరెన్స్ ఆప్షన్లు, అవసర సమయంలో ప్రామాణిక కవరేజ్ ప్రాముఖ్యతపై వివరించారు.

‘ఆటా’ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, సెక్రటరీ సాయినాథ్ రెడ్డి బోయపల్లి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు మహీందర్ ముస్కుల, వెన్ రెడ్డి, ఆర్వి రెడ్డి, కృష్ణ రంగరాజు కార్యక్రమానికి పాల్గొన్నారు. ‘ఆటా’ మీడియా చైర్ భాను స్వర్గం, మిల్వాకీ టీమ్ – పోలిరెడ్డి గంట, చంద్రమౌళి సరస్వతి, జయంత్ పరా, కరుణాకర్ రెడ్డి, వెంకట్ జలారి, సంతోషి వల్లూరి, రాజా నేతి, వివేకానంద్ కొమ్మినేని, విక్రంత్ రెడ్డి కుందూరు, విజయ్ కిషన్ వల్లూరి కోఆర్డినేషన్‌లో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమం సజావుగా సాగ‌డానికి కృషి చేసిన సాయి గ్రూప్ వాలంటీర్లు నిఖిలా కలిదిండి, జవహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం భారతీయ విద్యార్థుల అమెరికన్ జీవితాన్ని సులభతరం చేస్తూ, వారి భవిష్యత్ అవకాశాలను బలోపేతం చేస్తుందని ‘ఆటా’ నాయకులు ఆశాభావం వ్య‌క్తం చేశారు.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *