‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’గా నిర్వహణ

గుడిహత్నూర్: మాంగ్ సమాజ్‌ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిహత్నూర్‌లో అధ్యాక్రాంతి గురు లహుజీ సాళ్వె 231వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన స్వతంత్య్ర‌ సంకల్పాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలను ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’గా జరపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కార్యక్రమం లహుజీ సాళ్వెపై రూపొందించిన తెలుగు పాటకు గాయ్ కాంబ్లే నక్షత్ర, కాంబ్లే వేదిక చిన్నారుల బృంద సభ్యుల నృత్య ప్రదర్శనతో ఆరంభమైంది. అనంతరం అతిథులు జ్యోతిప్రజ్వలన చేసి లహుజీ సాళ్వె వస్తాద్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ జంగిటి వెంకటేష్ రాసిన లహుజీ హిందీ పాట సీడీని ఆవిష్కరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడి మెటీరియల్‌ను అతిథుల చేతుల మీదుగా అందజేశారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిలాబాద్ ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి మనోహర్ మాట్లాడుతూ, లహుజీ సాళ్వెలు దేశ స్వాతంత్ర్యానికి బాటలు వేసిన మహానుభావులలో ముందువరుసలో నిలిచారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని విద్యలో రాణించి, ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా సాగాలని యువతకు సూచించారు.

మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ మాట్లాడుతూ, లహుజీ సాళ్వె మహాత్మా ఫూలే విద్యా, సామాజిక సేవా కార్యక్రమాలకు అండగా నిలిచి, వివాహం చేసుకోకుండా తన జీవితాన్నంతా సమాజ శ్రేయస్సుకే అంకితం చేశారని పేర్కొన్నారు.
దేశంలో స్వాతంత్ర్య సంకల్పాన్ని మొదటిగా ప్రజల్లో నింపిన క్రాంతివీరుడిగా లహుజీని గుర్తించి, ఆయన జీవన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, జయంతిని అధికారికంగా ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

జిల్లా అధ్యక్షులు గాడేకర్ పరశురామ్ మాంగ్ మాట్లాడుతూ, మాంగ్ సమాజ్ ప్రజలకు కుల ధ్రువీకరణ పత్రాలను తహశీల్దార్ కార్యాలయాలద్వారా అందించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న మాంగ్ రైతుల పాత పహాణి పత్రాలను పునరుద్ధరించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి గాయ్ కాంబ్లే కుషాల్ రావ్ మాంగ్, గాయక్వాడ్ దత్తరాజ్ మాంగ్ (లోక్ స్వరాజ్ అందోళన్–మహారాష్ట్ర), మోహాలే దత్త మాంగ్ (ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు), గాడేకర్ రామేశ్వర్ మాంగ్ (కరీంనగర్ జిల్లా అధ్యక్షులు), కాంబ్లే సాయి మాంగ్ (మాంగ్ సమాజ్ తెలంగాణ విద్యార్థి విభాగం), అంకుష్ వాగ్మారే మాంగ్ (ఇంద్రవెల్లి మండలం అధ్యక్షులు), గాయ్ కాంబ్లే జాలేందర్ మాంగ్ (గుడిహత్నూర్ మండలం ప్రధాన కార్యదర్శి), కాంబ్లే నాగ్ నాథ్ మాంగ్ (గాదిగూడ మండలం అధ్యక్షులు) సహా అనేక మంది నాయకులు, మహిళలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాంగ్ సమాజ్ బంధువులు పాల్గొన్నారు.

 

https://breakingnow.app/mobileapp

 

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *