* హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్

* టాస్క్ (TASK) సహకారంతో సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలలో ఉచిత శిక్షణ

 

హైదరాబాద్:

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్, కాన్వొకేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.

600 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), మాటా (MATA) సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన 600 మంది విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ అందించారు. మైక్రోసాఫ్ట్ ఆధారిత ‘జావా బూట్‌క్యాంప్’ పాఠ్య ప్రణాళికతో ఈ శిక్షణ సాగింది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు.

 

 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. “గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలను నేర్పించడం అభినందనీయం. మాటా అందిస్తున్న ఆర్థిక సహకారం, టాస్క్ అందిస్తున్న నాణ్యమైన శిక్షణ.. విద్యార్థుల జీవితాలను ప్రొఫెషనల్ దిశగా మలుస్తాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు సాధించే స్థాయికి వారిని తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుంది” అని ప్రశంసించారు.

 

మాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ (BOD) & ఇండియా కోఆర్డినేటర్ డా. విజయ్ భాస్కర్ బోల్గాం మాట్లాడుతూ.. మాటా ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రతి ప్రవాస భారతీయుడు (NRI) తమ స్వగ్రామాన్ని దత్తత తీసుకుని, విద్య, వైద్యం మరియు మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములవుతున్నారని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో మాటా అధ్యక్షుడు కిరణ్ దుగ్గడి, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్ (న్యూజెర్సీ), BOD మల్లిక్ రావు బొల్లా (ఫిలడెల్ఫియా), కార్యదర్శి శ్రీధర్ గ్వాడలహారా తదితరులు పాల్గొన్నారు.

 

https://breakingnow.app/mobileapp

 

 

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *