హైదరాబాద్: హైదరాబాద్‌లోని నెక్సస్ మాల్ సమీపంలో 24 ఫ్రేమ్స్ వెడ్డింగ్ ఫిల్మ్స్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలతో పాటు ఇప్పుడు అలంకార ఈవెంట్ డెకార్ కంపెనీని ప్రారంభించింది. ఈ కంపెనీ వెడ్డింగ్ సంబంధిత అన్ని కార్యక్రమాలను సమగ్రంగా నిర్వహించనుంది. ప్రారంభోత్సవానికి అతిథులుగా యాంకర్ శ్యామల, రాంకీ ఇన్ఫ్రా డెవలపర్స్ నుండి రాంకీ, ఆంధ్రప్రదేశ్ వై.సి.పి అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి కార్మూరు, నటి మహతి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఫణి గోగిరెడ్డి ఈ కంపెనీ ద్వారా ఉన్నత స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యక్రమానికి ఫణి గోగిరెడ్డి సన్నిహితులైన దినేష్ వర్మ, ఉపేంద్ర రెడ్డి, నాగిరెడ్డి, రామకృష్ణం రాజు భూపతిరాజు, కలిదిండి వెంకట రామ కృష్ణ రాజు, వినయ్ పలకపాటి తదితరులు హాజరయ్యారు.