‘హనుమాన్’ ఇప్పుడు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెర‌కెక్కించిన‌ ఈ అద్భుతానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. థియేటర్స్‌లో ‘హనుమాన్’ చేసిన వీరవహారానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అయిపోయారు. ఈ రోజుల్లో ఊహ‌కంద‌ని విధంగా ఏకంగా 100 రోజులు థియేట‌ర్‌ల‌లో న‌డిచి తెలుగు సినిమా సత్తా ఏంటో మ‌రోసారి నిరూపించుకుంది. ప్రశాంత్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఈ అద్భుత విజ‌యానికి కార‌ణ‌మెవ్వ‌రు అని ప్ర‌శ్నిస్తే ద‌ర్శ‌కునితో పాటు నిర్మాత కూడా ఉన్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించి తెర వెన‌క హీరోలా నిలిచారు. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే ఈ ఫ‌లితాన్ని అంచ‌నా వేయ‌గలిగారంటే నిరంజన్ రెడ్డి ఈ సినిమాను ఎంతలా అంకిత‌భావంతో నిర్మించారో అర్థ‌మ‌వుతుంది.

సినిమాలోని ప్ర‌తి ఫ్రేమ్ గ్లోబల్ లెవల్ క్వాలిటీతో తీసిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతుంది. క‌థ ఎంపిక స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించి అమ‌లు చేశారు. 15 కోట్ల బడ్జెట్ అనుకున్న సినిమాను 65 కోట్ల వరకు ఖ‌ర్చు చేశారంటే సినిమాను ఎంత‌ న‌మ్మ‌కంగా నిర్మించారో అర్థం చేసుకోవ‌చ్చు. అదే న‌మ్మ‌కంతో సినిమాను ఏకంగా సంక్రాంతి సీజ‌న్‌లో జనవరి 12న విడుద‌ల చేశారు. పెద్ద హీరోలు సంక్రాంతి బ‌రిలో ఉన్నారు.. రిస్క్ చేయ‌డ‌మే.. అని అంద‌రు అంటున్న కూడా.. పక్కా ప్లాన్ తో థియేటర్స్‌లో రిలీజ్ చేసారు. ఇంకేముంది ఓ య‌జ్ఞంలా నిర్మించిన సినిమా మ‌హ‌ద్భుతం క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో వంద రోజుల పాటు థియేట‌ర్‌ల‌లో న‌డిచిన సినిమాగా రికార్డు సృష్టించ‌డ‌మే కాకుండా క‌లెక్ష‌న్‌ల‌లోనూ స‌రికొత్త రికార్డుల దిశ‌గా దూసుకుపోతోంది. దీనికి కార‌ణమైన‌ తెర‌వెనుక అస‌లు హీరో.. నిర్మాత‌ కె. నిరంజన్ రెడ్డి అంటూ సినీ విశ్లేష‌కులు కొనియాడుతున్నారు.

 

By admin