◉ సింగపూర్, ఉక్రెయిన్ మృతుల దరఖాస్తుల తిరస్కరణ
◉ అత్తా, కోడలు వివాదంతో ఒక దరఖాస్తు పెండింగ్
◉ విదేశీ సర్టిఫికెట్ల పరిశీలన కోసం మరికొన్ని పెండింగ్

ఎన్నో ఏళ్లుగా గల్ఫ్ కార్మికులు చేసిన పోరాటం ఫలించింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్ ప్రభుత్వం స్పందించింది. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16న జీవో జారీ చేసింది. లాభోక్తుల ఎంపిక,  చెల్లింపు కోసం అక్టోబర్ 7న మార్గదర్శకాల జీవో జారీ చేశారు.

ఆర్థిక సహాయం కోసం మృతుల కుటుంబ సభ్యులు పెట్టుకున్న దరఖాస్తులను తహసీల్దార్ల ద్వారా పరిశీలన చేయించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. 24 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున రూ. కోటి 20 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరి చేశారు. త్వరలో ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు (ప్రొసీడింగ్స్) ను మృతుల కుటుంబాలకు అందజేస్తారు. ప్రభుత్వ ట్రెజరీ ద్వారా సొమ్మును లాభోక్తుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు.

ఎండపల్లి మండలం కొత్తపేట కు చెందిన గోనె నరేందర్ సింగపూర్ లో, నడిపొట్టు సత్తయ్య ఉక్రెయిన్ లో మృతి చెందారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో లో ఉన్న గల్ఫ్ దేశాల జాబితాలో సింగపూర్, ఉక్రెయిన్ లు లేనందున వీరి దరఖాస్తులను తిరస్కరించారు. ఎక్స్ గ్రేషియా సొమ్మును పంచుకునే విషయంలో అత్తా, కోడలుకు (మృతుని తల్లికి, భార్యకు) ఏకాభిప్రాయం లేనందున ఒక ఒక దరఖాస్తు పెండింగ్ లో ఉంది. విదేశీ సర్టిఫికెట్ల పరిశీలన కోసం మరి కొన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి భరోసాగా నిలిచారని,  గల్ఫ్ బాధితులకు కాంగ్రేస్ అభయహస్తం అందిస్తున్నదని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి అన్నారు. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికుల వారసులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

జగిత్యాల జిల్లాలో ఎక్స్ గ్రేషియా మంజూరైన 24 మంది గల్ఫ్ మృతుల వివరాలు స్వగ్రామం / స్వస్థలం, మండలం, చనిపోయిన దేశం వారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం (8)
సూద వినయ్ కుమార్, నర్సింహులపల్లి, బీర్పూర్ (రియాద్, సౌదీ అరేబియా); గొట్ల కొమురయ్య, కొల్వాయి, బీర్పూర్ (అబుదాబి, యూఏఈ); బండ్ర రాజ శేఖర్, కొల్వాయి, బీర్పూర్ (దుబాయి, యూఏఈ); ఎంబారి నర్సయ్య, అల్లీపూర్, రాయికల్ (దుబాయి, యూఏఈ); తునికి శేఖర్, కొత్తపేట, రాయికల్ (దుబాయి, యూఏఈ); తౌటు రాంచంద్రం, క్రిష్ణా నగర్, జగిత్యాల టౌన్ (దుబాయి, యూఏఈ); సింగారపు గంగాధర్, గాంధీ నగర్, జగిత్యాల టౌన్ (దుబాయి, యూఏఈ); కొత్తకొండ సాయి క్రిష్ణ, పురానిపేట, జగిత్యాల టౌన్ (కువైట్)

కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం (7)
అల్లె రామస్వామి, శివాజీ నగర్, మెటుపల్లి (రియాద్,  సౌదీ అరేబియా); గట్ల శ్రీనివాస లక్ష్మణ్, వెల్లుల్ల రోడ్, మెటుపల్లి (దుబాయి, యూఏఈ); వెల్దుర్తి ప్రమోద్ కుమార్, కోరుట్ల (దుబాయి, యూఏఈ); మహ్మద్ నభీ, మాదాపూర్, కోరుట్ల (రియాద్, సౌదీ అరేబియా); సురకంటి చిన్న రాజరెడ్డి, అయిలాపూర్, కోరుట్ల (దుబాయి, యూఏఈ); కందెల్ల వెంకటి, వేంపల్లి, మల్లాపూర్ (రియాద్, సౌదీ అరేబియా); ఉప్పు గంగన్న, సాతారం, మల్లాపూర్ (దుబాయి, యూఏఈ)

వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం (4)
నిమ్మ శేఖర్, దమ్మన్నపేట, మేడిపల్లి (దమ్మామ్, సౌదీ అరేబియా); నాంపల్లి మహేష్, కట్లకుంట, మేడిపల్లి (బహరేన్); కొమిరెల్లి పెద్ద గంగారెడ్డి, తండ్రియాల్, కథలాపూర్ (రియాద్ సౌదీ అరేబియా); భూమల్ల గణేష్, మోత్కురావుపేట, బీమారం (దుబాయి, యూఏఈ)

ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం (4)
పరుశునేని రమేష్, చందోలి, గొల్లపల్లి (దోహా, ఖతార్); పులిశెట్టి రాజన్న, దమ్మన్నపేట, ధర్మపురి (రియాద్, సౌదీ అరేబియా); గోవిందుల రవి, గోపులాపూర్, బుగ్గారం (రియాద్, సౌదీ అరేబియా); బైర శ్రీనివాస్, పెగడపల్లి (కువైట్)

చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం (2)
కంకణాల శ్రీకాంత్, నాచుపల్లి, కొడిమ్యాల (దోహా, ఖతార్); యదరవేని రవీందర్, డబ్బు తిమ్మయ్యపల్లి, కొడిమ్యాల (దుబాయి, యూఏఈ)

  • మంద భీంరెడ్డి
    +91 98494 22622

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

 

By admin