▪️ దళితబంధు పథకం లో ఎస్సీ ఉపకులాలకు 40 శాతం కేటాయించాలి .
▪️ ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్.
మెదక్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత వెనుకబడ్డ దళిత ఉపకులాలకు 6 స్థానాలు కేటాయించాలని 57ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి అధికార, ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేసారు. ఆదివారం మెదక్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో జరిగిన మెదక్ జిల్లా సమావేశంలో అధ్యక్షులు పిన్నింటి దాసు చిందు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి దళితులలో 34శాతం ఉన్న 57ఎస్సీ ఉపకులాలు స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఈనాటికి రాజకీయ అధికారం పొందలేదని చట్టసభల్లో మా గొంతు వినిపించే నాయకుడులేరని ఆవేదన వ్యక్తంచేశారు అని అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో 57 ఎస్సీఉపకులాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని “దళితబందు “లో ఉపకులాలు ఒక్క శాతం కూడా లబ్ది పొందలేదని దళితుల అభివృద్దిపై చిత్తశుద్ది ఉంటే దళితులలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకు రెండవ విడత “దళితబందు”లో ఉపకులాలకు 40శాతం కేటాయించాలని, కులధ్రువీకరణపత్రాలు RDO ఆర్డీవో ద్వారా కాకుండా MRO తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో రాష్ట్రంలోని అన్నీనియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్బంగా మెదక్ జిల్లాలో లోని మోచి, బేడా బుడ్గ జంగం, చిందు, మాలజంగం, మాష్టిన్, డక్కలి, బైండ్ల, హోళియదాసరి తదితర వెనుకబడ్డ ఉపకులాలకు దళిత బంధు ఇవ్వాలని, మెదక్ పట్టణంలో 57 ఎస్సీ ఉపకులాల భవన్ ను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు శాఖమూరి యాదగిరి హోలియదాసరి, దర్శనం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి మెదక్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు పిన్నింటి దాసు చిందు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మెదక్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
మెదక్ జిల్లా అధ్యక్షునిగా – టేకుమట్ల శ్యామ్ హోలియదాసరి
ప్రధానకార్యదర్శిగా – బోద్ధుల స్వామి మాష్టిన్
ఉపాధ్యక్షులుగా –
1. ఇప్ప సత్తయ్య బెడబుడగజంగం,
2. టంటం రాములు హోలియదాసరి
సహాయకార్యదర్శి – శ్రీనివాస్ బేడా బుడగజంగం
కోశాధికారి -టేకుమట్ల శివకుమార్ హోలియదాసరి
కార్యవర్గ సభ్యులుగా –
1 శాఖమూరి జగన్ హోలియదాసరి
2 గుంటి రమేశ్ హోలియదాసరి
3 దర్శనం నారాయణ మష్టిన్
4 దర్శనం నర్సింలు మష్టిన్
5 టేకుమాట్ల శ్రీకాంత్
6 T.అర్జున్
7 ఉద్దు వీరయ్య
ఎన్నుకున్నట్లు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి తెలిపారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/
- HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP