ఆధ్యాత్మికత, ఆధునికత, స్వచ్ఛత కలగలసిన అద్భుత క్షేత్రం. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం BAPS స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌. అయితే ఇది నార్త్ అమెరికా న్యూజెర్సీ రాష్ట్రం, రాబిన్స్‌విల్లె పట్టణం ఉంది.ఈ అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలోని న్యూజెర్సీలో అక్టోబర్‌ 8వ తేదీన ప్రారంభం అయింది. ఇది న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌కు దక్షిణంగా 90 కి.మీ దూరంలో ఉంది.

  • స్వాతి దేవినేని (న్యూజెర్సీ):

అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీ ఆధ్యాత్మిక పరంగా చాలా బలంగా ఉంది. వారి కార్యకలాపాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అక్కడ దైవ మందిరాల నిర్మాణం 150 ఏళ్ల కిందటే మొదలైంది. అవన్నీ ఒక ఎత్తయితే.. బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ఒక్కటీ ఒక ఎత్తు. మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ప్రతిష్టాపన ఉత్సవాలు కొన‌సాగుతున్నాయి. అయితే 183 ఎకరాల విస్తీర్ణంలో 255 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ క్షేత్రాన్ని ఇప్పటికే వేలాదిమంది దర్శించుకుంటున్నారు.

బ్ర‌హ్మండం బ‌ద్ద‌ల‌య్యేలా ఆల‌యం ప్రారంభోత్స‌వం

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం BAPS స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌. నార్త్ అమెరికా న్యూజెర్సీ రాష్ట్రం, రాబిన్స్‌విల్లె పట్టణంలో ఈ హిందూ దేవాలయం విశిష్ట రీతిలో నిర్మాణం జరుపుకుంది. ఈ ఆలయాన్ని పూర్తిగా చేతితోనే చెక్కారు. న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేలో నిర్మించిన ఈ అరుదైన హిందూ దేవాలయాన్ని అక్టోబరు 8న ప్రారంభించారు. ఈ మహామందిర్ ను 19వ శతాబ్దపు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భగవాన్ స్వామినారాయణ్ కు అంకితం ఇచ్చారు. భగవాన్ స్వామినారాయణ్ తర్వాత ఐదో తరం ఆధ్యాత్మిక వారసుడు, ప్రముఖ సాధువు ప్రముఖ్ స్వామి మహరాజ్ ఈ ఆలయ నిర్మాణానికి ఆద్యుడు. 12,500 మందికి పైగా స్వచ్ఛంద సేవకులు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ప్రారంభోత్సవంలో అమెరికా చట్టసభల సభ్యుల‌తోపాటు, బైడెన్ ప్రభుత్వంలోని ప్రముఖులు, అమెరికాలోని పలు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొన్నారు.

10 వేల‌కుపైగా దేవ‌తా విగ్ర‌హాల‌తో న్యూజెర్సీ ఆల‌యం

అమెరికాలో తాజాగా ప్రారంభ‌మైన‌ హిందూ దేవాలయం BAPS స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేలో నిర్మించిన ఈ అరుదైన హిందూ దేవాలయం ఆధునిక కాలంలో భారత్ వెలుపల నిర్మాణం జరుపుకున్న దేవాలయాల్లో అతిపెద్దది. భారతీయ శిల్ప కళ, సంస్కృతి, ఆధ్యాత్మిక సంపదలను ప్రతిబింబించేలా ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. 12,500 మందికి పైగా స్వచ్ఛంద సేవకులు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. దాదాపు 12 ఏళ్లుగా ఈ ఆలయ నిర్మాణం కొనసాగింది. మొత్తం 183 ఎకరాల సువిశాల స్థలంలో ఈ ఆలయ ప్రాంగణం ఉంటుంది. ఆలయ నిర్మాణంలో 10 వేల విగ్రహాలు, ప్రతిమలు చెక్కారు. ఆలయ నిర్మాణం కోసం ప్రధానంగా లైమ్ స్టోన్, పింక్ శాండ్ స్టోన్, మార్బుల్, గ్రానైట్ బండలను ఉపయోగించారు. పదివేలకు పైగా హిందూ దైవ ప్రతిమలు కొలువుదీరాయి. చూడడానికి రెండు కళ్లూ చాలవన్నంత అద్భుతమైన కళాత్మక నిర్మాణం ఇది. ప్రపంచంలోని 300 నదులు, భారతదేశంలోని నాలుగు పుణ్యనదుల జలాలతో రూపొందించిన అరుదైన సరస్సు బ్రహ్మ కుండ్ ఇక్కడ స్పెషాలిటీల్లో ఒకటి. 12 సంవత్సరాల పరిశ్రమ తర్వాత.. వంద సామాజిక వర్గాలకు చెందిన 12 వేల 500 మంది వాలంటీర్ల చేతుల మీదుగా రూపొందిన అద్భుతమైన నిర్మాణం ఇది. ఆధునిక యుగంలో సంపూర్ణంగా చేతితో మాత్రమే చెక్కబడిన హిందూ దేవాలయాలలో ఇది ప్రధానమైనది.

చరిత్రకెక్కిన ఆల‌యం

భారీ ఆలయాల నిర్మాణం అనేది ఈ రోజుల్లో కష్టతరమైంది. కానీ ఈ ఆధునియ యుగంలోనూ భారీ దేవాలయాన్ని నిర్మించారు. దాదాపు 12 ఏళ్లుగా నిర్మాణ పనులు జరుపుకుంది. 183 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ సువిశాల అక్షర్‌ధామ్‌ ఆలయంలో.. పురాతన భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా 10 వేల విగ్రహాలు, సంగీత వాయిద్య పరికరాలు, నృత్యరూపాల శిల్పాలను చెక్కారు. అలాగే ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు.. భారీ గుమ్మటాన్ని ఈ అక్షర్ ధామ్ లో చూడవచ్చు. ఇది 1000 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా రూపొందించారు. మొత్తం నాలుగు రకాలైన సున్నపురాయి, గులాబీ ఇసుకరాయి, పాలరాయి, గ్రానైట్ రాళ్లతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. దాదాపు 2మిలియన్ క్యూబిక్ అడుగుల రాతిని.. ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. ఈ రాళ్లను బల్గేరియా, టర్కీ, గ్రీస్, ఇటలీ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అలాగే మనదేశం నుంచి నాణ్యమైన గ్రానైట్ ను తెప్పించారు. యూరప్ తో సహా లాటిన్ అమెరికా నుంచి తీసుకొచ్చిన రంగురాళ్లతో అలంకరించి.. ఆలయానికి సరికొత్త శోభను తీసుకొచ్చారు.

ఇక ఆలయంలో.. బ్రహ్మకుండ్‌ అనే పేరుతో సంప్రదాయ బావిని ఏర్పాటు చేశారు. దీన్ని భారత్ లోని పవిత్ర నదులు, అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలతో సహా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 కంటే ఎక్కువ నదుల నుంచి పవిత్రజలాలతో నింపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో రకాల మొక్కలు నాటారు. ప్రస్తుతం పెరిగి చెట్లుగా మారి.. పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఇప్పటికే ఈ ఆలయాన్ని అమెరికాలోని హిందువులతో పాటు.. స్థానికులు, ఇతర మతాలకు చెందిన ప్రముఖులు కూడా సందర్శించేందుకు తరలివస్తున్నారు.

దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ ఆలయ నిర్మాణ పనుల్లో లక్షలాదిగా వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ సహాయ సహకారాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. కేవలం అమెరికా నుంచే 12,500 మందికి పైగా వాలంటీర్లు పాలుపంచుకున్నట్లు వివరిస్తున్నారు. 12 వ శతాబ్దంలో నిర్మించిన కంబోడియాలోని అంగ్కోర్ వాట్‌ ఆలయం.. ఏకంగా 500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది. ఇది యునెస్కో వారసత్వ సంపదగా కూడా గుర్తింపు పొందింది. ఆ తర్వాత న్యూజెర్సీలోని అక్షర్ ధామ్ ఆలయమే అతిపెద్దదిగా.. చరిత్రకెక్కింది.

***

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin