హైదరాబాద్:
తెలుగు తెర‌పైకి మ‌రో సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. కృష్ణసాయి – మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న ‘జ్యువెల్ థీఫ్’ సినిమా టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియ‌ర్ న‌టీన‌టులు.. ప్రేమ, అజయ్, ప్రేమ, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు న‌టించారు.

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జ‌రిగిన ‘జ్యువెల్ థీఫ్’ సినిమా టీజర్, ఆడియో లాంచ్ వేడుక‌లో చీఫ్ గెస్టుగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీఐజీ అనిల్ మింజ్, మరో చీఫ్ గెస్టు ఏపీ, తెలంగాణ ఇన్కమ్ టాక్స్ కమీషనర్ IRS ఆఫీసర్ జీవన్ లాల్ లవిదియ, మరో గెస్టు న‌టీ ఎస్త‌ర్ పాల్గొని చిత్ర టీజ‌ర్‌తో పాటు పాట‌ల‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా న‌టి ఎస్తార్ మాట్లాడుతూ… హీరో కృష్ణసాయి నిజ జీవితంలోనూ రియల్ హీరో. ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు. నిజంగా గ్రేట్. టీజ‌ర్ చూస్తే.. ‘జ్యువెల్ థీఫ్’ మంచి కాన్సెప్టుతో తెర‌కెక్కిన‌ట్టు అర్థ‌మ‌వుతున్న‌ది. సినిమా పెద్ద‌ హిట్ అవుతుందని నమ్మకం క‌లుగుతుంది.

హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ… నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వ‌చ్చాను. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ఇక ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగుంది. ఒక‌ప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో క‌లిసి న‌టించాల‌న్న నా కల ఈ సినిమాతో నెరవేరింది.

30 ఇయర్స్ పృథ్వి మాట్లాడుతూ… నేను, అలాగే కృష్ణ సాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. స‌మాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచితనం, మానవత్వం కలబోసిన వ్యక్తి. గ‌తంలోనే కృష్ణ‌సాయి డ్రగ్స్ మీద అవగాహన వీడియోలు చేశారు. హీరోగా ‘జ్యువెల్ థీఫ్’ సినిమాలో యాక్షన్ పార్టులతో పాటు అద్భుతంగా నటించాడు. నా రోల్ కూడా బాగుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

డైరెక్టర్ పీఎస్ నారాయణ మాట్లాడుతూ… నా మీద నమ్మకంతో త‌న‌తో సినిమా చేయ‌మ‌ని కృష్ణసాయి వచ్చారు. ఆయనకు తగ్గ కథను పది రోజుల్లోనే పూర్తి చేశాను. సినిమా నటీనటులు, చిత్ర యూనిట్ అందరు బాగా చేశారు. ఇది చిన్న సినిమా కాదు, పేరున్న సీనియర్ నటీనటులు ఇందులో ఉన్నారు. అంద‌రిని ఆక‌ట్టుకునే సినిమా ఇది.

న‌టుడు మిమిక్రి శివారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు పూర్తి స్థాయి క్యారెక్టర్ ఇచ్చారు. దర్శకుడు మా అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండి సినిమా అద్భుతంగా పూర్తి చేశారు. శ్రీలేఖ అందించిన పాటలు బాగున్నాయి. కృష్ణసాయి గారికి అద్భుతమైన టాలెంట్ ఉంది.

ఈ హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ మాట్లాడుతూ… ఈ సినిమాలో నాది ఛాలెంజింగ్‌ రోల్. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు.

న‌టి ప్రేమ మాట్లాడుతూ… నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ అంద‌రిని ఆకట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

నటుడు ఆనంద చక్రపాణి మాట్లాడుతూ… నాకు ఇప్పటివరకు చేయని అద్భుతమైన క్యారెక్ట‌ర్‌ను దర్శకుడు ఇచ్చారు. సినిమాపై అంచ‌నాలు పెరిగిపోవ‌డం ఖాయం. అలాంటి స‌బ్జెక్టు ఇది.

జీవన్ లాల్ మాట్లాడుతూ… చక్కని సబ్జెక్టు. కంప్రమైస్ కాకుండా క్వాలిటీతో సినిమాను పూర్తి చేయడం అభినందనీయం. సినిమా కళను బతికిస్తున్న నిర్మాతలకు చేతులెత్తి మొక్కాలి. ఎంతో ఫ్యాషన్‌తో తీసిన ఈ చిత్ర యూనిట్‌కు విషెస్ తెలియజేస్తున్నాను.

టీజ‌ర్, ఆడియో వేడుక‌లో న‌టీన‌టుల‌తో పాటు, సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, సినిమా హైలైట్స్, చిత్రీకరణ అనుభవాలు తెలిపారు. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు.

నటీనటులు:
హీరో కృష్ణసాయి, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్, ప్రేమ, అజయ్, సీనియర్ కన్నడ హీరోలు శ్రీధర్, వినోద్ కుమార్, నటీమణులు రాగిణి, హీరోయిన్ నేహా దేశపాండే , ఆనంద చక్రపాణి, జెన్నీ, మేక రామ కృష్ణ, వైజాగ్ జగదీశ్వరి, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, అప్పాజి, కాట్రగడ్డ సుధాకర్, జంగారెడ్డి, వెంకట రమణారెడ్డి, శ్రావణి, శ్వేత రెడ్డి తదితరులు.

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:
పీఎస్ నారాయణ

డీవోపీ: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్ : జేపీ
ఫైట్ మాస్టర్: రమణ
డాన్స్: స్వర్ణ, యాని
లిరిక్ : కామేశ్వర్, పీఎస్ నారాయణ
మ్యూజిక్: ఎంఎం శ్రీలేఖ,
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
ఆర్ట్ డైరెక్టర్ కె.మురళీధర్,
పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్

  • BREAKING NOW APP
    ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
    Breaking Now APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKING NOW TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV


 

By admin