🔸 వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎస్సీ ఉపకులాలకు 6 స్థానాలు కేటాయించాలి
🔸 దళితబంధు పథకం లో ఎస్సీ ఉపకులాలకు 40 శాతం కేటాయించాలి
🔸 – ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్
► BreakingNews App | దుబ్బాక: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత వెనుకబడ్డ దళిత ఉపకులాలకు ఆరు స్థానాలు కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి అధికార, ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేశారు. ఈరోజు దుబ్బాక పట్టణంలోని నిలకంఠ సంఘ భవనంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు పిన్నింటి దాసు చిందు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి దళితులలో 34శాతం ఉన్న 57ఎస్సీ ఉపకులాలు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఈనాటికి రాజకీయ అధికారం పొందలేదని చట్టసభల్లో మా గొంతు వినిపించే నాయకుడులేరని అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో ఎస్సీఉపకులాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, “దళితబందు “లో ఉపకులాలు ఒక్క శాతం కూడా లబ్ది పొందలేదని దళితుల అభివృద్దిపై చిత్తశుద్ది ఉంటే దళితులలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకు రెండవ విడత “దళితబందు”లో ఉపకులాలకు 40శాతం కేటాయించాలని, కులధ్రువీకరణపత్రాలు ఆర్డీవో ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇచ్చేవిధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని అన్నీనియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్బంగా దుబ్బాక నియోజకవర్గంలోని మోచి, బేడా బుడ్గ జంగం, చిందు, మాలజంగం, మాష్టిన్, డక్కలి, బైండ్ల, హోలీయదాసరి తదితర వెనుకబడ్డ ఉపకులాలకు దళిత బంధు ఇవ్వాలని, దుబ్బాక పట్టణంలో ఎస్సీ ఉపకులాల భవన్ ను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిన్నింటి దాసు చిందు, ప్రధాన కార్యదర్శి బుడాల సత్యరాజ్ మాలజంగం, ఉపాధ్యక్షులు ఎర్పుల నాగరాజు మాల జంగం, మోతె మహేష్ బేడ బుడ్గ జంగం, కే. శ్రీనివాస్ మోచి, పస్తం రవి, చింతల రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి దుబ్బాక నియోజకవర్గం నూతన కార్యవర్గం ఎన్నిక.
ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు పిన్నింటి దాసు చిందు ఆధ్వర్యంలో దుబ్బాక నిలకంఠ సంఘ భవన్ లో జరిగిన సమావేశంలో దుబ్బాక నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
దుబ్బాక నియోజకవర్గ అధ్యక్షునిగా – పానేటి స్వామి బేడ(బుడ్గ)జంగం.
ప్రధాన కార్యదర్శిగా -బైరి బాలనర్సు మోచి
ఉపాధ్యక్షులుగా-
1. కీసర సోమలింగం మాలజంగం
2. పిన్నింటి మధు చిందు
3. పస్తం సత్తయ్య బేడా బుడ్గ జంగం
4. దాసరి అంజయ్య బైండ్ల
5. రాగిశెట్టి ఓమ్ ప్రకాష్ మోచి
6. అందే నాంపల్లి మాష్టిన్
కార్యవర్గ సభ్యులుగా –
1. కురుకుంట్ల రమేష్ మాలజంగం
2. దాసరి పర్శరాములు బైండ్ల
3. వానరాసి మదనయ్య
4. బుద్ధుల స్వామి మాష్టిన్
ఎన్నుకున్నట్లు తెలిపారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP