ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ (మీడియా బాస్ నెట్వర్క్):
లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పవర్ ఉమెన్‌గా ఎంపికైన మోహన ఇందుకూరికి అవార్డు అందించి సత్కరించారు. పవర్ ఉమెన్ 2022గా ఎంపికైన మహిళలకు అవార్డులు అందించి సత్కరించారు. ఈ ఈవెంట్‌కు జ్యూరీగా ఆఫ్ ఈవెంట్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) వ్యవహరించింది. లీడ్ ఇండియా ఫౌండేషన్, డాక్టర్ అబ్దుల్ కలాం విజన్ 2020 ఆలోచన, నాణ్యమైన విద్యా, మహిళా సాధికారత, భవిష్యత్తు తరాలకు శాంతి సామరస్యాన్ని నెలకొల్పడానికి ఆధ్యాత్మిక కుటుంబాలను అభివృద్ది చేయడం వంటి లక్ష్యంతో స్థాపించారు.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక (హైటెక్ సిటీ) అతిపెద్ద కాన్వకేషన్ హాల్లో 124 నిమిషాల్లో 272 మంది పవర్ ఉమెన్లను సత్కరించడం ద్వారా లీడ్ ఇండియా ఫౌండేషన్ USA అధ్యక్షుడు డాక్టర్ హరికృష్ణ మారమ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను సృష్టించారు. 1,000 కంటే ఎక్కువ నామినేషన్ల నుండి నామినేషన్ ప్రక్రియ జరిగింది. 272 మంది పవర్ ఉమెన్స్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోని 28 రాష్ట్రాలకు చెందినవారు.
శిల్పకళా వేదికలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, నటి జీవిత, లీడ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ నేహా సక్సెనా, లీడ్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డా. హరికృష్ణ మారం, గ్లోబల్ రిట్జీ గ్రూప్ సీఈవో ఎమ్మెన్నార్ గుప్త, సీఈఓ భాను ప్రకాష్ రెడ్డి, పవర్ ఉమెన్ అనురాధా ఒబిలిశెట్టి (దుబాయ్), పవర్ ఉమెన్ పద్మజ మానెపల్లి, పవర్ ఉమెన్ సంధ్య జెల్ల, పవర్ ఉమెన్ సునయన, పవర్ ఉమెన్ లేఖా సిస్ట్లా, పవర్ ఉమెన్ జ్యోతి ప్రసాద్, పవర్ ఉమెన్ సువర్ణ శర్మ, పవర్ ఉమెన్ రేష్మా ఠాకూర్, పవర్ ఉమెన్ 2021 షర్మిల,పవర్ ఉమెన్ అరుణ చిట్టా, సినీ నటీ ఈషా రెబ్బ తదితరులు పాల్గొన్నారు.
#MohanaIndukuri mohana indukuri, #mohana indukuri, #ReneeSystems, #Renee.ai #Power Woman, power women 2022,