యాదాద్రి (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
ఎప్పుడూ చిన్న చిన్న వాహనాలకే పూజలు జరగటం చూసిన చాలా మంది జనం ఒక్క సారిగా హెలికాఫ్టర్ కి పూజలు చేయడం చూడటానికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రతిమ గ్రూప్‌ యజమాని బోయిన్‌పల్లి శ్రీనివాస్‌రావు కొనుగోలు చేసిన ఈ హెలికాఫ్టర్ ఎయిర్‌బస్‌ ఏసీహెచ్‌-135 అని తెలిసింది. ఈ కొత్త హెలికాఫ్టర్ కి ముగ్గురు పూజారుల మార్గనిర్దేశంతో శ్రీనివాస్‌రావు కుటుంభ సభ్యులు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా పాల్గొన్నారు.

పూజలు నిర్వహించిన అనంతరం పుణ్యక్షేత్రం చుట్టూ హెలికాప్టర్‌ లో షికారు చేశారు. ఈ ఎయిర్‌బస్‌ ఏసీహెచ్‌ 135 హెలికాప్టర్‌ 500 కిలోమీటర్ల రేంజ్‌, 20 వేల ఫీట్ల ఎత్తు వరకు ప్రయాణం చేస్తుందని ఫైలట్‌ వెల్లడించారు. దీని ధర 5.7 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ. 47 కోట్లు కంటే ఎక్కువగా ఉంటుంది.

ప్రతిమ గ్రూప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే దీని గురించి చాలా మందికి తెలుసు. హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రతిమ గ్రూప్ మౌలిక సదుపాయాలు, ఇంధనం, తయారీ, టెలికాం రంగాలలో మాత్రమే కాకుండా మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ వంటి వాటిని కూడా కలిగి ఉంది. మొత్తానికి ప్రతిమ గ్రూప్ దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో ముందుకు వెళుతోంది.

ఇదిలా ఉండగా ఆంద్రప్రదేశ్ లో తిరుమల పుణ్యక్షేత్రం అంత వైభవాన్ని యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామికి తీసుకురావడానికి అక్కడ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించింది. ప్రస్తుతం ఈ దేవాలయానికి దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు. రోజు రోజుకి ఈ దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. యాదగిరిగుట్టలో హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇది మొదటి సారి కాదు. ఎందుకంటే గతంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ప్రభుత్వం కొనుగోలు చేసిన హెలికాప్టర్‌కు మొదటిసారిగా యాద‌గిరిగుట్ట‌ పుణ్యక్షేత్రంలో వాహన పూజ నిర్వహించారు. అప్పట్లో ఆ హెలికాఫ్టర్ కి స్వామి వారి పేరే పెట్టినట్లు సమాచారం. ఆ తరువాత హెలికాఫ్టర్ కి పూజలు చేయడం బహుశా ఇది రెండవ సారి. నిజానికి భారతీయ సనాతన సంస్కృతి ప్రకారం ఎంతవారైనా ఒక వాహనం కొనుగోలు చేస్తే దానికి పూజ చేసిన తరువాతే వినియోగించడానికి ఆసక్తి చూపుతారు. ఈ సాంప్రదాయం ఒకప్పటి నుంచి కూడా అలాగే వస్తూనే ఉంది.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin