– బీఎస్ రాములు
సామాజిక తత్వవేత్త
————————-
గౌరవ ప్రదమైన అంత్యక్రియలు అందరి హక్కు.
బతికినంత కాలం ప్రతి మనిషి ఈ సమాజం అస్తిత్వం కోసం అందులో భాగంగా జీవించారు.
మనిషి జన్మించినపుడు సంఘజీవిగా జన్మిస్తుంది. మనిషి మరణం అంత్య క్రియలు కూడా గౌరవ ప్రదంగా సాగాలి. భౌతిక కాయం కూడా వారి జీవితంలో భాగమే. మరణానంతరం కూడా వారి గౌరవిస్తూ దండలు వేస్తాము. దండం పెడుతాము. ప్రతి ఒకరికి గౌరవ ప్రదంగా అంత్య క్రియలు జరగడం మానవ జన్మ హక్కు.

    శవదహనం, శవ ఖననం గొప్ప పుణ్య కార్యం. ఈ పనులకోసం జిల్లాలో ఈ మధ్య కార్పోరేట్ స్థాయిలో ఒక సంస్థ వెలసింది. ఈ ఆధునిక కాలంలో ఇలాంటి సంస్థల సేవలు ఊరూరా విస్తరించాల్సిన అవసరం. గౌరవ ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించే సంస్థ పెట్టిన వారికి జోహార్లు. 37 వేలు ఖర్చులకు తీసుకుంటున్నారని తెలిసింది. 37 వేలు చాలా తక్కువే. జగిత్యాల వంటి టౌన్ లలో కూడా అంత్య క్రియలకు రెండు లక్షలకు పైనే ఖర్చు అవుతున్నది.. సకాలంలో దూర తీరాల నుండి బంధు మిత్రులు చేరుకోవడం, అంత్యక్రియల విధి విధానాలు తెలియక పోవడం, ఖర్చులు పెరిగి అప్పులపాలవడం చాలా చోట్ల జరుగుతున్నది. గౌరవప్రదంగా తక్కువ ఖర్చుతో అంత్యక్రియల విధి విధానాలు రూపొందించచుకోవడం అవసరం. ప్రభుత్వ ఉద్యోగుల అంత్య క్రియలకు ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయిస్తున్నాయి. అంత్య క్రియల సేవల కోసం జీవితాలను అంకితం చేసి సేవలు చేస్తున మనుషుల గురించి పత్రికల్లో చూసుకుంటాము. వారు మహనీయులు. నిజానికి ఈ అంత్యక్రియల బాధ్యత ప్రభుత్వం, మునిపల్ వంటి స్థానిక సంస్థలే కాకుండా ప్రధానంగా ఇన్సూరెన్స్ సంస్థలు బాధ్యత తీసుకోవాలి. జీవితమంతా కిస్తులు కట్టి లక్షలాది ఉద్యోగులకు ఉపాధి కల్పించిన క్లయింట్లు చనిపోతే చని పోయిన మనిషి పట్ల ఏ మాత్రం బాద్యత లేకుండా కేవలం నామినీలకు మీ పైసలు ఇవిగో విదిలిస్తునారు ఇన్సూరెన్సు సంస్థలు.

మరణించిన వారిని మాత్రం వదిలేస్తారు. బీమా సంస్థలు చావు భయం, తన మరణానంతర పిల్లల భవిష్యత్ భద్రత అని చెప్పి లక్షలకోట్లు సేకరిస్తున్నారు. కాని ఆ మనిషి అంత్య క్రియలకు ఒక విభాగం ఏర్పాటు చేసి సహకరించాలనే మానవత్వం చూపలేకపోతున్నారు. చెప్పేది మనిషి మానవత్వం , మరణానంతర నామినీల భవిష్యత్తు గురించి! మీరు పోయాక అంటూ బెదిరించినట్లు ఆలోచింప జేసే వీరు మీరు పోయాక మీకు సగౌరవంగా అంత్య క్రియలు చేస్తాం అని అని లేక పోయారు. తద్వారా వారు వ్యాపారం చేయడమే తప్ప మనిషితో మానవత్వం తో మాకేం పని అని ప్రవర్తిస్తున్నారు.

మహాభారత యుద్దంలో లక్షలాదిమంది మరణించారు. శతాబ్దాలుగా యుద్దాల్లో , ప్రపంచ యుద్ధాల్లో కోట్లాది మంది మరణించారు. వారందరికి గౌరవ ప్రదంగా అంత్యక్రియలు సాధ్యం కాలేదు. చివరకు పాండవులకు కూడా గౌరవ ప్రదమైన అంత్యక్రియలు జరగ లేదు. నడుస్తూ నడుస్తూ ఎక్కడో పడిపోయారు. తమ్ముల్లు, ద్రౌపది అని కూడా ధర్మరాజు వెనక్కి తిరిగి చూడ లేదు. సీతామ తల్లికి కూడా అంత్య క్రియలు గౌరవ ప్రదంగా జరగలేదు. భూమిని చీల్చుకొని భూమిలోకి వెళ్లి పోయింది. మన్మథునికి కూడా శివుడు గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయలేదు. కాలం మారి అవసరాలు మారి ఇన్సూరెన్సు కంపనాలు, బ్యాంకులు వెలిసాయి. నోబులా బహుమతులను బ్యాంకుల అధ్వర్యంలో న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తున్నారు. బ్యాంకులు డిపాజిట్లు , సేకరించడంతోపాటు అంత్యక్రియల బాధ్యత తీసుకోవాలి.

ఇన్సూరెన్స్ సంస్థలు అంత్యక్రియల బాధ్యత తీసుకోవడం తప్పనిసరి చేయాలి. అలా తీసుకునే బ్యాంకుల్లో , ఇన్సూరెన్స్ సంస్థల్లో ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం . బ్యాంకులు ఇన్సూరెన్స్ సంస్థలు హాస్పిటల్స్ తో టై అప్ పెట్టుకున్నట్టుగా గౌరవ ప్రదంగా అంత్య క్రియలు చేపట్టే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఎంతో మంది మహనీయులు వారి శరీరాన్ని హాస్పిటల్స్ కు దానం ఇస్తున్నారు. వారికి ఏదో ఒక నాడు వారి మిగిలి శరీర అవయవాలకు గౌరవ ప్రదంగా అంత్యక్రియలు జరపడం కనీస బాధ్యత. ఈ బాద్యత చేపడితే ఎంతో మంది తమ దేహాలను వైద్య పరిశోధనలకు ఇవ్వడానికి ముందుకు వస్తారు. మరణానంతరం అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగడం ప్రతి మనిషి మానవ హక్కు. ధనిక పేద, కుల మత ప్రాంత స్త్రీ పురుష వివక్ష కు తావులేకుండా అందరికీ గౌరవ ప్రదమైన అంత్య క్రియలు వారి జన్మహక్కు. మనిషి జన్మను ఎంతో గౌరవప్రదంగా ఆహ్వానిస్తున్నాము.అంతిమ వీడ్కోలు అంత్యక్రియలు అంతే గౌరవప్రదంగా జరిగేట్టు చూడడం అవసరం. అవయవ దానం పేరిట బతకాల్సిన వారికోసం చేస్తున్న అవయవదాన ఉద్యమకారులు మరణించిన వారి అంత్య క్రియలు గౌరవ ప్రదంగా జరిగే బాద్యత తీసుకోకపోతే అది అవసరానికి వాడుకొని శవాన్ని వదిలేయడం అవుతుంది.

మనిషి అంత్య క్రియలు గౌరవప్రదంగా తక్కున ఖర్చుతో జరిగే విధి విధానాలను, అట్టి బాధ్యతలను జనన మరణ రిజిష్టర్ నిర్వహించే మున్సిపాలిటీ, స్థానిక సంస్థలకు ప్రభుత్వాలు స్వచ్చంద సంస్థలు చేదోడుగా ఉండడం అవసరం.

మనిషి ఏకాకి కాదు. మనిషి సంఘజీవి. మనిషి పుట్టుకతోనే సంఘజీవి. మనిషి మరణం కూడా సంఘజీవిగానే గౌరవ ప్రదమైన అంత్య క్రియలకు వీడ్కోలు పలకాలి. గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపే సంస్థలను ప్రభుత్వం GST నుండి మినహాయించి సబ్సిడీపై సామగ్రి ఏర్పాటు చేయడం అవసరం.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin