-
ఫిలించాంబర్ ఎదుట దిష్టిబొమ్మ దగ్ధం
-
మనోభావాలను దెబ్బ తీస్తే ఊరుకోం
-
మీ సినిమాలు ఆపేస్తాం బిడ్డా..
-
బహిరంగ క్షమాపణలు చెప్పాలి- తెలంగాణ సగర (ఉప్పర) సంఘం
హైదరాబాద్ (ఫిలించాంబర్):
ధమాకా చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటుడు-నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సగర (ఉప్పర) సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా కామెంట్లు చేస్తున్నారంటూ హైదరాబాద్ ఫిలించాంబర్ వద్ద తెలంగాణ సగర (ఉప్పర) సామాజికవర్గం నాయకులు ఆందోళన చేపట్టారు. ధమాకా చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్లో ఆ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని, ఇలాంటి వారిని సహించబోమని తెలంగాణ సగర (ఉప్పర) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మండిపడ్డారు. నటుడు-నిర్మాత బండ్ల గణేష్ కూడా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సినిమాలు ఆడకుండా ఆపేస్తామని తెలంగాణ సగర (ఉప్పర) సామాజికవర్గం నాయకులు, ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
దర్శకుడు త్రినాథరావు నక్కిన, బండ్ల గణేష్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సామాజికవర్గాన్ని కించపరిస్తే సహించబోమంటూ సగర ఉప్పర సంఘం నాయకులు ఫిలించాంబర్ ఎదుట దర్శకుడు త్రినాథరావు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వారు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, సినిమాలను ఆపేస్తామని హెచ్చరించారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews