మనం ఫౌండేషన్ అమెరికా ప్రతినిధి కాసర్ల శ్రీని జన్మదినం
నిరుద్యోగి రాజలింగంగౌడ్‌కి ల్యాప్‌టాప్ అందజేత
యువతకు స్పూర్తిగా నిలిచిన బుర్రా వెంకటేశం
మనసున్న మారాజుల సహకారంతో సేవ యజ్ఞం
కష్టకాలమొచ్చినప్పుడు ఆత్మస్థైర్యంతో పాటూ మరో మనిషి సాయం కూడా అవసరమే. నిస్సాహయస్థితిలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే మార్గం ఉండాలి. అప్పుడే మనిషి శక్తిమంతుడవుతాడు. దాంతో ఆ సమాజం మెరుగవుతుంది. సరిగ్గా ఇలాంటి సేవలకు ‘మనం’ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటోంది. మనసున్న మారాజుల సహకారంతో ఈ సేవయజ్ఞం కొనసాగుతోంది.
మనం ఫౌండేషన్ అమెరికా ప్రతినిధి కాసర్ల శ్రీని జన్మదినం సందర్బంగా మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలకు పోటీ పడుతున్న నిరుద్యోగి రాజలింగంగౌడ్‌కి బీసీ వెల్ఫేర్ కమీషనర్ బుర్రా వెంకటేశం గౌడ్ గారి చేతుల మీదుగా లాప్ టాప్‌ను అందజేశారు. అలాగే కాసర్ల శ్రీనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బుర్రా వెంకటేశం గౌడ్ గారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మనం ఫౌండేషన్ ను ఆయన మనసారా అభినందించారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. బుర్రా వెంకటేశం గౌడ్ గారు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం నుంచి మొదలయ్యారు. తల్లి కూలిపనులు చేస్తూ కొడుకును చదివిస్తే.. అతడు దేశమే గర్వించదగిన వ్యక్తిగా మారాడు. కోట్లాది మంది యువతకు స్పూర్తిగా నిలిచాడు బుర్రా వెంకటేశం గారు. అలాంటి సక్సెస్ పర్సన్ చేతుల మీదుగా లాప్ టాప్ అందుకోవడంపై నిరుద్యోగి రాజలింగం గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తనకు చేయూతనిచ్చిన కాసర్ల శ్రీని, మనం ఫౌండేషన్ కి ధన్యవాదములు తెలిపారు. ఈ సేవ కార్యక్రమంలో మనం ఫౌండేషన్ ఫౌండర్ కుమార్ పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews