ఇండియాలో ఐపీఎల్ (IPL)కు ఉన్న క్రేజే వేరు. క్రికెట్ అభిమానులు ప్రత్యేకంగా దీనికోసమే OTT సబ్స్క్రిప్షన్ తీసుకుంటుంటారు. కానీ ఈసారి ఆ అవసరం ఉండకపోవచ్చు. ఐపీఎల్ (IPL 2023) డిజిటల్ ప్రసార హక్కులను పొందిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని వయాకామ్ 18 మీడియా లిమిటెడ్ ఉచితం గానే ఐపీఎల్ (IPL 2023) మ్యా చ్లను ప్రసారం చేయనుందని సమాచారం. ఈ విషయాన్ని కంపెనీలోని ఇద్దరు ఉన్నతోద్యోగులు ధ్రువీకరించినట్లు బ్లూమ్బెర్గ్ తెలిపింది. అలాగే వయాకామ్ ప్రతినిధులు దీన్ని ధ్రువీకరించినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు సైతం కథనాలు ప్రచురించాయి. వయాకామ్ 18 నుంచి మాత్రం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.

12 భాషల్లో..
ఇప్పటి వరకు ఐపీఎల్ (IPL 2023) మ్యాచుల‌ను చూడడం కోసం అభిమానులు డిస్నీ + హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉండేది. కానీ, ఈసారి డిజిటల్ ప్రసార హక్కు లను వయాకామ్ 18 మీడియా 2.7 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. జియో సినిమా యాప్ ద్వా రా మ్యా చ్లను ఉచితం గా ప్రసారం చేయనున్న ట్లు తెలుస్తోం ది. ఇటీవల ముగిసిన ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ తరహాలోనే అభిమానులు ఐపీఎల్ మ్యాచ్లను సైతం వీక్షించొచ్చు. పైగా తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, గుజరాతీ, బెంగాళీ, భోజ్పురీ సహా మొత్తం 12 భారతీయ భాషల్లో కామెంటరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్, ఆటగాళ్ల గణాంకాలతో పాటు హీట్ మ్యాప్, పిచ్పై విశ్లేషణ వంటి వివరాలను సైతం మ్యాచ్ మధ్యలో తెరపై మనం ఎంచుకున్న భాషలో కనిపిస్తాయని సమాచారం.

4k రెజల్యూషన్‌తో..
ఫిఫా వరల్డ్ కప్ సమయంలో అభిమానులు జియో సినిమా స్ట్రీమింగ్ క్వాలిటీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఆ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మ్యాచ్లన్నింటినీ 4కే రెజల్యూషన్ (అల్ట్రాహెచ్డీ)లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. పైగా ఫిఫా మ్యాచ్ల తరహాలోనే మల్టీక్యామ్ టెక్నాలజీతో వివిధ కోణాల్లో మ్యాచ్లను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సమాచారం.

అందుకే ఉచితం !
వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా వయాకామ్ మ్యాచ్లను ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. భారత్లో గూగుల్, ఫేస్బుక్ వంటి వేదికలు ఉచితంగానే సేవలందిస్తూ ప్రకటనల ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. సబ్స్క్రి ప్షన్ ద్వా రా సేవలను ఆఫర్ చేస్తున్న ఓటీటీ వేదికలతో పోలిస్తే అవి మంచి సక్సెస్ను సాధించాయి. ఈ నేపథ్యం లోనే వయాకామ్ సైతం ఆ మార్గాన్ని అనుసరిం చే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా అత్యధిక మందిని ఇం టర్నె ట్ సేవల వినియోగ పరిధిలోకి తీసుకురావాలనే జియో లక్ష్యం సైతం నెరవేరే అవకాశం ఉంది. దాదాపు 50 కోట్ల మంది ఐపీఎల్ను వీక్షించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు 5జీ సేవల్ని ఇటీవలే ప్రారంభించిన జియో.. కస్టమర్లను వేగంగా దాని పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి కూడా ఇది దోహదం చేయనుంది. ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 8 వారాల పాటు ఈ టోర్నీ కొనసాగనుంది. మొత్తం 74 మ్యాచులు జరగనున్నాయి.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin