జగిత్యాల (మల్లాపూర్ ):
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామానికి చెందిన నూనావత్ మనిమాల ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రాష్ట్రంలోనే రెండవ ర్యాంక్ సాధించింది. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నూనావత్ రాజు-హారిక కూతురు మనిమాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిసిలో 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంక్ లో నిలిచింది. దీంతో మనిమాలను గ్రామ ప్రజాప్రతినిధులు అభినందిoచారు. భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, డాక్టర్ గా తయారై బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం తమ గ్రామానికి గర్వకారణం అని సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్ , ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి మనిమాలకు అభినందనలు తెలిపారు.