🔴 మల్లారెడ్డికి విశ్రాంతి ఇస్తే టికెట్ ఎవ‌రికి?
🔴 మలిపెద్ది, జ‌క్క ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా?
🔴 బీజేపీ టికెట్ అందుకునేది కొంపల్లి? విక్రమ్ రెడ్డి?
🔴 తీన్మార్ మల్లన్న పోటీ చేస్తాడా?
🔴 జంగయ్య యాదవ్ స్పీడ్ వెన‌క కార‌ణం ఏంటీ?

మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం (గేమ్ ఛేంజ‌ర్ – విశ్లేష‌ణ‌)
తెలంగాణలో మేడ్చల్ నియోజకవర్గం స‌మ్‌థింగ్ స్పెష‌ల్. జెట్ స్పీడ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పొలిటిక‌ల్‌గా చూసుకుంటే రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌. ఇక్క‌డి నుంచి మ‌ళ్లీ గెలిచేదెవ‌రు అనే విష‌యము ఇప్పుడు ఇక్క‌డ బ‌ర్నింగ్ టాపిక్. మ‌రి ఇక్క‌డ నుంచి బ‌రిలో నిలిచేదెవ‌రు? నిలిచి గెలిచేదెవ‌రు? ద‌మ్మున్న లీడ‌ర్ ఎవ‌రు? దుమ్మురేపేదెవ‌రు? ఈ ఆనాలిసిస్‌లో తెలుసుకుందాం.

గులాబీ పార్టీ టికెట్ మార్పు ఖాయ‌మా?
మేడ్చల్ నియోజకవర్గం చెప్ప‌గానే ముందుగా మంత్రి మ‌ల్లారెడ్డి గుర్తుకు వ‌స్తారు. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌టం త‌ప్పా ఆయ‌న‌కు మ‌రో ప్ల‌స్ పాయింట్ లేదు. ఇటీవ‌ల పిల్ల కామెడీ చేస్తూ చుల‌కన‌గా మారారు. మ‌ల్లారెడ్డికి మైన‌స్ పాయింట్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడ బీఆర్ఎస్ మీటింగ్ జరిగినా..వీరిద్దరు ఎడమొహం పెడమొహం పెట్టుకుంటారు. వీరిద్దరి మధ్య విభేదాలు ప‌లుమార్లు బహిర్గతమయ్యాయి. అయితే మ‌ల్లారెడ్డికి ఈ సారి టికెట్ రాక‌పోవ‌చ్చ‌నే టాక్ కూడా వినిపిస్తోంది. అవినీతి ఆరోపణలు, స్థానిక కేడర్ లో సఖ్యత లేక‌పోవ‌డం, కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వకపోవటం, వర్గపోరు, అహంకార ధోరణి, ఎవరినైనా డబ్బుతో కొనేస్తా.. అనే వైఖరి ఇలాంటి వాటితో పాటు ఈ సారి కేటీఆర్ కోటరీ కే ఎక్కువ ప్రాధాన్యత వుండనున్న నేపథ్యం.. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డికి విశ్రాంతి ఉండొచ్చు అంటున్నారు విశ్లేష‌కులు.

మ‌ల్లారెడ్డికి టికెట్ ఇవ్వ‌కుంటే ఆయ‌న కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రికి ఇచ్చే అవ‌కాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్లూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు.
ఇక బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్న నాయ‌కుల్లో పిర్జాదీగూడ‌ మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్ రెడ్డి కూడా ఉన్నారు. వెంక‌ట్ రెడ్డి రాజ‌కీయాల్లో వ‌చ్చిన కొద్ది రోజుల‌కే మేయ‌ర్ పీఠం ద‌క్కించుకున్నాడు. వ్యాపారవెత్త‌గా, బిల్డ‌ర్‌గా మంచి స్ట్రాంగ్‌లో ఉన్నారు. కేటీఆర్‌తో ఉన్న స‌న్నిహిత్యం త‌న‌కు క‌లిసివ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు.

బీజేపీ నుంచి..
నియోజకవర్గంలో బ‌లం పెంచుకోవాల‌ని ఉవ్వీళ్లూరుతోంది బీజేపీ. ఈ నేప‌థ్యంలో బీజేపీ నుంచి కొంపల్లి మోహన్ రెడ్డి లేదా పటోళ్ల విక్రమ్ రెడ్డి.. ఎవరికి పార్టీ అవకాశం ఇస్తుందా అనే విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే అయినా గత ఎన్నికల అనుభవం, కేడర్ లో పట్టు, ఆర్థిక సామర్థ్యం కొంపల్లి కి వున్న అదనపు బలం. ఇంకా విక్రమ్ రెడ్డి కి ఈ మధ్య కాలంలో పెరిగిన కాడర్.. పార్టీ పనులలో చురుకుగా వ్యవహరించండం అధిష్టానం దగ్గర కలిసొచ్చే అంశం. ఎవరు ఎన్నికలలో పోటీచేసినా.. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు, సాంప్రదాయ ఓటుతో టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు.

ఇక చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న మేడ్చ‌ల్ నుంచి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు కూడా తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ గా పోటీ చేసిన ఎన్నికల అనుభవం, మాటల బలం ఒకింత కలిసొచ్చే అంశం. తీన్మార్ మ‌ల్ల‌న్న పోటీ చేస్తే గ‌న‌క బీఆర్ఎస్ ఓట్ల‌ను చీల్చే అవ‌కాశం క‌నిపిస్తుంది.

కాంగ్రెస్‌లో క్లారిటీ ?
మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బ‌లం కూడా భారీగానే ఉంది. ఈ నేప‌థ్యంలో టికెట్ ఎవ‌రికి అనే విష‌యం ప్ర‌స్తుతం హాట్ టాపిక్. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు తోటకూర జంగయ్య యాదవ్ ఆలియ‌స్ వ‌జ్రేష్ యాద‌వ్. ప్ర‌స్తుతం టీ-పీసీసీ ఉపాధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న వ‌జ్రేష్ యాద‌వ్.. రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కావ‌డంతో కాంగ్రెస్ నుంచి ఆయ‌న‌కు సీటు ఖరారు అయినట్టే అనే టాక్ వినిపిస్తుంది. కుల గణాంకాలు.. రేవంత్ రెడ్డి చరీష్మా.. స్థానిక ఎంపీగా తన పలుకుబడి, గత ఎన్నికల అనుభవం, ఆ ఎన్నికలలో ఓటమి తో పెరిగిన సానుభూతి, ప్రధానంగా బీసీ వర్గం నుంచి మద్దతు వుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవ‌ల‌ స్థానికంగా కాంగ్రెస్ బ‌లం పుంజుకున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ సారి ఎన్నికలలో ‘రెడ్డి’ వర్గాన్ని కాదని బీసీ వర్గానికి కనుక పార్టీ టికెట్ ఇస్తే మాత్రం తోటకూరకు గెలుపు అవ‌కాశాలు ఎక్కువే.

మొత్త‌మ్మీద మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. ఈ ప్ర‌ధాన పార్టీల‌ టికెట్‌ల‌ను అందుకునే అభ్య‌ర్థుల‌ను బ‌ట్టి ప‌రిస్థితులు కాస్తా అటు ఇటు కావ‌చ్చ‌నే మాట వినిపిస్తోంది.

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

 

By admin