న్యూజెర్సీ (Media Boss Network): భారతీయ సంస్కృతి, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞాన ప్రవాహం భగవద్గీత ప్రవచనమును విని ప్రవాస భారతీయులు తరించారు. న్యూజెర్సీ-ఎడిషన్‌లోని శ్రీ శివ విష్ణు టెంపుల్‌లో భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ గాయకుడు, బ్రహ్మశ్రీ లక్కావఝ్జుల వేంకట గంగాధర శాస్త్రి ‘గీతా గాన ప్రవచనం’ చేశారు. అమెరికాలోని తెలుగు సంఘం ‘మన అమెరికా తెలుగు అసోషియేషన్’ (MATA) శ్రీదత్తా పీఠం, తెలుగు కళా సమితితో కలిసి నిర్వహించిన ఈ కల్చరల్ ఈవెంట్‌లో తెలుగు ప్రవాసీయులు పాల్గొన్నారు.
5121 సంవత్సరాల క్రిందట సాక్షాత్తూ కృష్ణ భగవానుడే ప్రవచించిన కార్యగ్రంథం భగవద్గీత సర్వశాస్త్రమయి అని ఆ గ్రంథ పఠనాన్ని బాల్యదశ నుంచే అలవడేలా చూడాలని ఈ సందర్భంగా గంగాధర శాస్త్రి కోరారు. ఈ సందర్భంగా ఆయాన “గీతా గాన ప్రవచనం”లో ఆయన అద్భుత ప్రసంగం చేశారు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేందుకు గీతను మించిన కరదీపిక మరొకటి లేదన్నారు. ధర్మం అంటే స్వకార్యం కాదు లోకకళ్యాణం కలిగించేదని తెలిపారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ప్రతిఫలాన్ని భగవానుడి పాదాలకు వదిలేసి భవబంధాలకు అతీతంగా జీవించడమే హైందవ జీవనమని గంగాధర శాస్త్రి అన్నారు. గీత చదవగలగడం అద్భుతం, అర్థం చేసుకోవడం మహాద్భుతం, ఆచరించగలిగితే పరమాద్భుతమని వ్యాఖ్యానించారు. అనంతరం గంగాధర శాస్త్రిని మాటా కార్యవర్గ సభ్యులు సత్కరించారు. శ్రీదత్తపీఠం నిర్వహకులు శ్రీ రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
“మాటా” అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఈ వేడుక విజయవంతం కావడానికి కృషి చేసిన టీమ్ మెంబర్స్ కిరణ్ దుద్దగి((ED), ప్రవీణ్ గూడూరు (GS) & వెంకీ మస్తీ (RVP), మల్లిక్ రెడ్డి (RVP)కి శ్రీనివాస్ గనగోని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ కలాల్ (ఎన్‌సి), రంగారావు (ఎస్‌సి), శిరీషా గుండపునేని (ఎస్‌సి), ఆర్‌సిలు రవి, నరేందర్, రఘు మరియు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ గనగోని ధన్యవాదాలు తెలిపారు.
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews