తీరొక్క పూలు.. కోటొక్క పాటల కోలాహాలం.. తెలంగాణ అస్థిత్వ వైభవం.. ఆడపడుచుల ఆరాధ్య వైభోగం.. అగ్ర‌రాజ్యంలోనూ బ‌తుక‌మ్మ క‌నులవిందుగా అలంక‌రించుకున్న‌ది. ద‌స‌రా సంబురాలు అంబ‌రాన్నంటాయ్.. రెండు క‌ళ్లు చాల‌వు అన్న‌ట్టుగా వేడుక‌లను ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఘ‌నంగా నిర్వ‌హించింది.

ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో వార్షికోత్సవ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల ఆశ్చర్యాలోని మెల్బోర్న్ నగరంలో ఎస్టికేట్ స్పోర్ట్స్ సెంటర్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ తెలంగాణ గాయినీ తేలు విజయ బతుకమ్మ ఆట పాటలతో అందర్నీ అలరించారు. ఈ వేడుక‌లు గత పది సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నామని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుపుతున్నామని ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ముఖ్య కారణం కమిటీ కార్యవర్గ సభ్యులు స్పాన్సర్స్, వాలంటీర్స్అని అనిల్ బైరెడ్డి తెలిపారు. ఇకముందు కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మన ఆటపాటలను ముందు తరాల వారికి అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మినిస్టర్స్ కౌన్సిల్, మేయర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ATAI కార్యవర్గ సభ్యులు కిరణ్ పాల్వాయి, ఫణికుమార్, వంశీ కొట్టాల, రవి దామర, మహేష్ రెడ్డి, శ్రీనివాస్ కర్ర, కిషోర్ యానం, మధుపైల, రఘు కోట్ల, దీపక్ హరి, కృష్ణ ఒడియాల, పుల్లారెడ్డి బద్దం, రాజవర్ధన్ రెడ్డి, మహేష్ బద్దం, అమరేందర్ రెడ్డి, ప్రవీణ్ దేశం, సతీష్ పటి, శ్యాం లింగంపల్లి తదితరులు పాల్గొన్నారు.

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin