ఇండ‌స్ట్రీలో యంగ్ అండ్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ల ట్రెండ్ నడుస్తోంది. కొత్త కథలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. స్క్రీన్ ప్లేతోనే ఆకట్టుకునే మేకర్లు వస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొత్త మూవీ మేక‌ర్స్, కొత్త టీం అంతా కలిసి ‘ప్లాట్’ అనే మూవీని తీశారు. బి.బి.టి.ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై భాను భ‌వ తార‌క ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ సేపురు, భాను భ‌వ తార‌క‌, త‌రుణ్ విఘ్నేశ్వ‌ర్ సేరుపు నిర్మించిన చిత్రం ‘ప్లాట్’. ఈ మూవీలో వికాస్ ముప్పాల‌, గాయ‌త్రి గుప్తాలు హీరో హీరోయిన్లుగా నటించారు. శుక్ర‌వారం థియేట‌ర్‌ల‌లోకి వ‌చ్చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూరిపోర్టులో తెలుకుందాం.

కథ:
రాహుల్ (ఒక ఫెయిల్యూర్ బిజినెస్‌మేన్‌) మరియు దీపు (దీప్తి) (డ్రగ్ డీలర్) ఇద్ద‌రూ రిలేష‌న్‌షిప్‌లో ఉంటూ ఎమ్మిగనూరులో తలదాచుకుంటారు. హైదరాబాద్‌లో ఆమె హత్య చేసిన వ్యక్తి సోదరుడు సమీర్ దీపును ట్రాక్ చేస్తాడు. దీపుతో దేశం విడిచి వెళ్లేందుకు రాహుల్ తన ఇంటిని అమ్మే ప్రయత్నం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సక్సెస్ అవుతాడు. సమీర్ వెతుక్కుంటూ రాగానే అత‌న్ని చంపి రాహుల్ అమ్ముతున్న భూమిలో పాతిపెడ‌తారు. అంతా రాహుల్ దారిలో సాగుతున్నట్లు కనిపించినప్పుడు, ఒక అపరిచితుడు అతని రియ‌ల్ఎస్టెట్ బిజినెస్‌ను ఆపమని బెదిరిస్తాడు. ఆ అపరిచితుడు ఎవరో క‌నిపెట్టే ప్ర‌య‌త్నంలో రాహుల్ తన గురించి, గతం గురించి తెలుసుకుంటాడు. ఈ క్ర‌మంలో ఊహించ‌ని ట్విస్టులు చోటుచేసుకుంటాయి. మ‌రి రాహుల్ త‌న గురించి తెలుసుకున్న నిజాలు ఏంటీ? త‌న‌కు ఎదుర‌య్యే విప‌త్కార ప‌రిస్థితుల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు అనేదే తెలుసుకోవాలంటే థియేట‌ర్‌కు వెళ్లాల్సిందే.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:
వికాస్ ముప్పాలా రాహుల్ క్లిష్టమైన పాత్రలో చాలా బాగా న‌టించాడు, ర‌క‌ర‌కాల ఎమోష‌న్‌లు చూపించే హీరో పాత్ర‌లో సాంప్రదాయక హీరోగా కాకుండా స‌రికొత్త‌గా స‌హ‌జంగా న‌టించి మెప్పించాడు. ఇక దీపు పాత్ర‌లో గాయత్రి గుప్తా తన పాత్రలో లీన‌మై న‌టించింది. ప్రేక్ష‌కుడికి ఊపిరాడ‌కుండా చేసే పాత్ర‌లో జీవించింద‌నే చెప్పాలి. స్వేచ్ఛ కోసం ఆరాటపడడాన్ని, నిరంతర టెన్ష‌న్ వాతావ‌ర‌ణంలో త‌న న‌ట‌న‌ నైపుణ్యం ఏంటో చూపించింది. ఇక మిగ‌తా తారాగణం కూడా త‌మత‌మ‌ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:
తక్కువ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా క్వాలిటీలో మాత్రం టాప్‌లో ఉంది. నిర్మాత‌లు కార్తీక్ సేపురు, భాను భ‌వ తార‌క‌, త‌రుణ్ విఘ్నేశ్వ‌ర్ సేరుపు.. సినిమా క్వాలిటీ విష‌యంలో ఏ మాత్రం రాజీప‌డ‌లేద‌ని అర్థ‌మ‌వుతుంది. త‌క్కువ బ‌డ్జెట్‌లో క్వాలిటీగా తెర‌కెక్కించ‌డంలో డైరెక్ట‌ర్ త‌న టాలెంట్ చూపించిన‌ట్టు చాలా సీన్ల‌లో అర్థ‌మ‌వుతుంది.

విశ్లేష‌ణ‌:
మర్డర్, రియల్ ఎస్టేట్ చుట్టూ కథ సాగుతుంది. క‌థ‌కు త‌గ్గ‌ట్టే స్క్రిన్‌ప్లే గ్రిఫ్‌గా ఉంది. మాట‌లు కూడా ఆలోచింప‌జేసేలా ఉన్నాయి. ”ఎంత స‌క్సెస్ ఉంది మీ రియ‌ల్ ఎస్టేట్‌లో” అని అడిగిన ప్ర‌శ్న‌కు ”ప్ర‌పంచంలో భూమి అంత ఉంది” అనే సమాధానం రియ‌ల్‌స్టిక్‌గా, గొప్ప‌గా అనిపిస్తుంది. తాను రాసుకున్న క‌థ‌ను అంతే ప‌ర్‌ఫెక్టుగా తెర‌కెక్కించ‌డంలో డైరెక్ట‌ర్ భాను భవ తారక విజ‌య‌వంత‌మ‌య్యాడ‌నే చెప్పాలి. త‌న ప్ర‌తిభ ఏంటో ఈ సినిమాతో పూర్తి స్థాయిలో నిరూపించుకున్న‌డు. మూస ప‌ద్ద‌తిలో కాకుండా త‌న‌దైన శైలిలో స‌రికొత్త‌గా చూపించే ప్ర‌యత్నానికి డైరెక్ట‌ర్‌కు నిజంగా అభినంద‌న‌లు చెప్పాల్సిందే. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఓ కొత్త అనుభూతికి లోనవుతార‌న‌డంలో సందేహం లేదు.

రేటింగ్: 3.5 / 5

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin