పోల్స్ అంటూ ఛానెల్స్ అన్నీ ఊదరగొడుతున్నాయి! ఒకటీ రెండు సంస్థలు మినహా దాదాపు అన్నీ కాంగ్రెస్ అధికారం లోకి రానున్నదని ప్రకటించాయి! సెఫాలజిస్టులు కూడా కాంగ్రెస్ అనే చెబుతున్నాయి!

నిజానికి ఎగ్జిట్ పోల్ ఎవ్వరూ చేయలేరు! ఇవన్నీ ప్రి పోల్స్, ఎస్టిమేటెడ్ పోల్స్ మాత్రమే! ఎందుకంటే, ఎగ్జిట్ పోల్ అంటే ఎన్నికల రోజు ట్రెండ్ ను బట్టి చెబితే అవి ఎగ్జిట్ పోల్! కానీ, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక్క డ్యూటీ పాస్ వున్న పాత్రికేయులకు మాత్రమే అనుమతి ఉంది! కానీ, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలకు అనుమతి లేదు! బూత్ లు, వార్డులు, ఊర్లు తిరిగి ఇవాళ ఓటింగ్ పూర్తి అయ్యాక సర్వే చేసి చెప్పిన అంకెలు కావు! ఇవి ఊహాగాన అంకెలు మాత్రమే!

ఓటరు నాడి పట్టుకోవడం అంత వీజీ కాదు! పైకి ఒక గుర్తు చెబుతాడు! వచ్చిన వాళ్ళకు దండాలు పెట్టిన వాడికీ “నీకే నా మద్దతు” అని తలూపుతాడు! అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటాడు! మందు, విందు సరేసరి! కానీ ఓటు ఎవరికి వేస్తాడో కుటుంబ సభ్యులకు మినహా ఎవ్వరికీ చెప్పడు! అదీ కుటుంబ సభ్యుల ఓటు కూడా తను అనుకున్న గుర్తు కు వేయించడానికి పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు చెబుతాడు! ఈ పోల్స్ సర్వే ఏజెంట్లకు అస్సలు నిజాలు ఎవ్వరూ చెప్పరు! అందుకే పోల్స్ నిర్వాహకులు కేవలం ఆయా ప్రాంతాల్లో కొందరితో మాత్రమే మాట్లాడి వీరి సొంత ఆలోచనలతో అంకెలు వేసేస్తారు! అందుకే ఏ పార్టీ కి సరైన అంకె ఇవ్వరు. 10 నుంచి 16 వరకు రావచ్చు అంటారు! నిజమైతే తమ సంస్థకే క్రెడిబిలిటీ దక్కుతుంది!

ఈసారి పుట్ట గొడుగుల్లా సర్వే సంస్థలు పుట్టుకొచ్చాయి! రాజకీయ పార్టీ లు ప్రత్యేకంగా చేయించుకునే రోజుల నుంచి అభ్యర్థులు కూడా స్వయంగా సర్వేలు చేయించుకుంటున్నారు! సర్వే చేసినందుకు కొన్ని సంస్థలు 2 లక్షలు తీసుకుంటే, జాతీయ స్థాయి సంస్థలు రెండు కోట్లు తీసుకుంటాయి! ఇదంతా బ్రెయిన్ గేమ్! ఒక్కో సంస్థ ఒక్కో రేటు! ఎవరు డబ్బులు ఇస్తే వారి వైపు మెజారిటీ చూపించే సర్వే సంస్థలే దాదాపు అన్నీ! ఏదయినా అది కూడా వ్యాపారమే!

నేను కూడా పాత్రికేయులు, మిత్రులు, కొందరు సెఫాలజిస్టులు, కొందరు ఓటర్లు, మరి కొందరు రాజకీయ నాయకులతో మాట్లాడి ఇవాళ ఒక అంచనా కు వచ్చాను! నేను చేసిన ప్రి పోల్స్ ప్రకారం BRS కు 65 వస్తే, ఇవాళ ఎగ్జిట్ పోల్ చూస్తే అది 56 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు ప్రి పోల్ లో 36 వస్తే, ఎగ్జిట్ పోల్ లో 42 సీట్లు గెలుచుకోబోతోంది! బీజేపీ కేవలం 3 గెలుచుకుంటుంది అని ముందస్తు అనుకుంటే ఇప్పుడు 5 సీట్లు గెలుస్తోంది! MIM 5 మాత్రమే వస్తాయనుకుంటే, ఇవాళ్టి పోలింగ్ ప్రకారం 6 సీట్లు గెలుచుకోబోతోంది! ఇది rafee’s సర్వే!

– డా. మహ్మద్ రఫీ

 

 

By admin