▪️ 2 వారాల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి
▪️ పెద్దాపూర్ గురుకులంలో అనుమానాస్పదస్థితిలో మృతి
▪️ నలుగురు విద్యార్థులకు అస్వస్థత
▪️ భయాందోళనతో తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు
▪️ అధికారుల నిర్లక్ష్యమే అంటున్న తల్లిదండ్రులు
▪️ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్న అధికారులు
జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మృతి కలకలం సృష్టిస్తోంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. విద్యార్థుల అస్వస్థత, మృతిపై స్పష్టమైన కారణాలు తెలియక విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులను స్వగ్రామాలకు తీసుకువెళ్ళడంతో హాస్టల్ ఖాళీ అయింది.
పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు ఏమైందో తెలియడం లేదు. కడుపునొప్పి అంటు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోతున్నారు. పదిరోజుల క్రితం 8వ తరగతి విద్యార్థి రాజారపు ఘనాధిత్య అస్వస్థతకు గురి కాక ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రిలో కోలుకున్నారు.
అది మరిచిపోక ముందే తాజాగా శుక్రవారం ఉదయం మరో ముగ్గురు విద్యార్థులు కడుపునొప్పి అంటూ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అనిరుద్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతనిది స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట. మరో ఇద్దరు విద్యార్థులు హేమంత్ మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో, మొండి మోక్షిత్ నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని, అనారోగ్యానికి కారణం మాత్రం తెలియడం లేదని వైద్యులు తెలిపారు. విద్యార్థుల రక్త నమూనాలను ల్యాబ్ పంపించామని రిపోర్ట్ వస్తే గానీ ఏమైందో తెలియదని చెప్పారు.
స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత, ఇద్దరు మృతి పై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ సందర్శించి పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల అస్వస్థతపై ఆరా తీశారు. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు.
విద్యార్థులు కడుపునొప్పి అంటూ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కోల్పోవడం విచిత్రంగా ఉందన్నారు. నిజామాబాద్ ఆసుపత్రికి తరలించిన విద్యార్థికి దారిలో ఆర్మూర్ ఆసుపత్రిలో పాముకాటు ఇంజెక్షన్ ఇప్పించామని పాముకాటుతోనే అలా అయి ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. పాఠశాల యాజమాన్యం, టీచర్లు నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. అసలు పిల్లలకు ఏమైందో కూడా చెప్పలేని స్థితిలో అక్కడి టీచర్లు సిబ్బంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ లో ఎలుకలు, పాములు, బయట కుక్కలు ఇలా ఉంటే పిల్లలు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సస్పెండ్ చేసినా మారని పరిస్థితి…
10 రోజుల క్రితం విద్యార్థి అస్వస్థకు గురై ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోవడంతో ఫిట్స్ వచ్చి చనిపోయాడని ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు. కానీ వాస్తవ పరిస్థితులకు ఆయన వివరణ విరుద్ధంగా ఉండడంతో వెంటనే కలెక్టర్ హాస్టల్ ను సందర్శించి ప్రిన్సిపల్ విద్యాసాగర్ ను సస్పెండ్ చేశారు. ఇన్ చార్జి ప్రిన్సిపల్ గా మహేందర్ రెడ్డిని నియమించారు. ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. వరుసగా విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ అసలు విషయాన్ని అధికారులు పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
గురుకుల పాఠశాలలో పిల్లలకు రక్షణ లేదని భావిస్తూ పేరెంట్స్ తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తుండడంతో హాస్టల్ ఖాళీ అవుతుంది. హాస్టల్ పరిస్థితి పై అధికారులు సీరియస్ గా స్పందించి నిస్పాక్షితంగా విచారణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r