సిరిసిల్ల: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) ఆధ్వర్యంలో సిరిసిల్ల, KCR నగర్‌లో ఉచిత క్యాన్సర్ అవగాహన కార్యక్రమం జ‌రిగింది. ఇందులో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్, జనరల్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్వస్థవ క్యాన్సర్ కేర్ ఎన్జీవో, MNJ క్యాన్సర్ కేర్ ఇన్‌స్టిట్యూట్, సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్య విభాగం సహకారంతో నిర్వహించారు.

డా. చేతుర్వేది క్యాన్సర్ అవగాహన సదస్సులో పాల్గొని క్యాన్సర్ ఎలా వస్తుందో, దాన్ని ఎలా నిరోధించవచ్చో, గుర్తించవచ్చో, చికిత్స చేయవచ్చో ప్రజలకు వివరించారు. TDF ఇండియా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. TDF ఆరోగ్య సేవ ప్రాజెక్టుపై దృష్టి సారిస్తూ, తెలంగాణను ఆరోగ్యకరమైన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ మరణాలకు రెండవ ప్రధాన కారణమని, 40% కంటే ఎక్కువ క్యాన్సర్ మరణాలు మార్పుచేయగల కారణాల కారణంగా జరుగుతున్నాయని, ధూమపానం, మద్యం, అసమతుల ఆహారం కారణాలు కావచ్చని పేర్కొన్నారు. క్యాన్సర్ ముందస్తుగా గుర్తించడం, చికిత్స తీసుకోవడం వలన ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు.

టిడిఎఫ్ మహిళల ఛైర్‌పర్సన్ తిమ్మయ్యగారి వాణి మాట్లాడుతూ, క్యాన్సర్ నివారణలో మహిళల పాత్ర ముఖ్యమని, ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు.

సిరిసిల్ల DMHO డా. వసంత్ రావు, TDF, స్వస్థవ క్యాన్సర్ కేర్, MNJ వారి కృషిని ప్రశంసిస్తూ, క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్, ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ప్రజలకు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌ని చెప్పారు. ముఖ్య అతిథి కేకే మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సాధనలో టిడిఎఫ్ పాత్రను గుర్తు చేస్తూ, తెలంగాణ అభివృద్ధికి టీడీఎఫ్ ఎన్నారైల‌ కృషిని ప్ర‌శంసించారు.

500 మంది ఈ క్యాంప్‌లో పాల్గొని జనరల్ ఓపీ కన్సల్టేషన్, మ్యామోగ్రామ్ పరీక్ష, సర్వికల్ క్యాన్సర్ టెస్ట్, మరియు మౌఖిక క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి వైద్య సేవలను పొందారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ DMHO అంజెలినా అల్ఫ్రెడ్‌, ప్రోగ్రామ్ మేనేజ‌ర్ న‌యీమ్ జ‌హాన్, డాక్ట‌ర్లు స్నేహ‌, రేఖ‌, దీప్తి, బాషా, రాజ‌కుమార్‌, సత్య‌నారాయ‌ణ‌, స‌తీష్‌, స్థానిక ఆశా వర్కర్లు, ANMs పాల్గొన్నారు.

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW
Breaking Now

By admin