రైతుల‌కు ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై టీడీఎఫ్ అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిద్దిపేట: జాతీయ రైతుల దినోత్సవం సంద‌ర్భంగా తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం (TDF) జై కిసాన్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసంపల్లి రైతు వేదికలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ‌హించారు. రైతులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలో దాని ప్ర‌త్యేక‌త‌, లాభాలు తెలిపారు.

ప్రకృతి వ్యవసాయంలోని పంచ సూత్రాలైన దుక్కి దున్నకుండా, రసాయనిక ఎరువులు వాడకుండా , పురుగుమందులు వాడకుండా, కలుపు మందులు వాడకుండా, కత్తిరింపు లేకుండా ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలోఈ కార్య‌క్ర‌మంలో రైతుల‌కు వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి కొయ్యాలు కాలుస్తూ కాలుష్యానికి కారణం అవుతున్నారు. అదేవిధంగా వరి కొయ్యాల కాల్చడం వల్ల భూమి సారం పూర్తిగా దెబ్బతింటుంది. వ్య‌వ‌సాయానికి ఉప‌యోగ‌ప‌డే అనేక సూక్ష్మజీవులు మరణిస్తాయి. దీనివల్ల భూమి త‌న సారం పూర్తిగా కోల్పోతుంది. భూమి సారం కోల్పోవడం వ‌ల్ల రైతులు అధిక దిగుబడి కోసం డిఏపి యూరియా వాడుతుంటారు. దీనివ‌ల్ల వ్యవసాయ పెట్టుబడి పెరగాడమే కాకుండా రైతుపై ఆర్థిక భారం పడుతుంద‌ని తెలిపారు.

రైతులు తమ పొలంలో వరి కొయ్యాలూ కాల్చుకోకుండా మార్కెట్లో దొరికే వివిధ రకాల వేస్ట్ డీకంపోజర్స్ సింగర్ సూపరేట్ ఫాస్పేట్‌తో పొలంలో కలియబెడితే అది త్వరగా మురిగి ఎరువుగా మారుతుందని, దాంతో భూమికి అనేక రకమైన పోషకాలు అందుతాయని తెలిపారు. రైతులు హార్వెస్టర్ యంత్రంతో వరి కోసేటప్పుడు ఎంత వీలైతే అంత కింద నుంచి వరి కోయడం వల్ల వరి గడ్డి పశువులకు ఉపయోగపడుతుంద‌న్నారు. రైతులు కోపరేటివ్ సొసైటీ ద్వారా మార్కెట్లో లభించే ప్యాడి ట్రషర్ యంత్రాన్ని కొనుకొచ్చి దానిని పొడిగా మారిస్తే భూమి కూడా సారవంతం అవుతుందని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

రైతులు తమ పంట‌ల‌కు రసాయనిక ఎరువులు వాడడం వల్ల జ‌రిగే న‌ష్టాల‌ను వివ‌రించారు. రసాయనిక ఎరువుల వాడకంతో భూమిలోని జీవరాసులు సైతం చనిపోతున్నాయ‌ని, పంట భూమిని కాపాడుకునేందుకు కొంతమంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందిస్తున్నార‌ని తెలిపారు. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుతూ ఇతర రైతులకు ఆదర్శంగా ఉండాలని రైతులను కోరారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు సూచించారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం పై మరిన్ని అవగాహన సదస్సు రైతులకు నిర్వహిస్తామని తెలిపారు. యువతని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళించడానికి, వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం – జై కిసాన్ ప్రాజెక్టులో భాగంగా రైతులకి ఉచిత ఆవులు, ఎద్దులు కూడా అందించ‌డం జ‌రుగుతుంద‌ని టీడీఎఫ్‌ మండల ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

రైతులు తమ పొలాల్లో అత్యధిక రసాయనిక ఎరువులు వాడకుండా, ప్రకృతి వ్య‌వ‌సాయం చేయాల‌న్నారు.

ఐక్యరాజ్య‌ సమితి ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను అందించడం కష్టమ‌ని, 2050 నాటికి ప్రపంచ జనాభా 9 కోట్లకు చేరుకోనుంద‌ని, అందుకు అనువుగా ఇప్పటి ఆహార ధాన్యాల ఉత్పత్తి 60 శాతానికి పైగా పెంచాల్సి ఉంటుందన్నారు. 1960లో మొదలైన హరిత విప్లవంతో విత్తన నాణ్యత పెరిగి దిగుబడి గణనీయంగా వచ్చింది కానీ వాటిలో ఎలాంటి పోషక విలువలు ఉండట్లేద‌ని, అత్యధిక ఆహార ఉత్పత్తులను పెంచడానికి రైతులు అధిక సంఖ్యలో అటు డీఏపీ గాని యూరే గాని కెమికల్ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ఇటు భూమి సారం పెరుగుతుంద‌న్నారు. మనిషికి మనుగడకు అవసరమైన భూ ఆరోగ్యాన్ని కర్తవ్యంగా స్వీకరించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కోరింది.

సమగ్ర పద్ధతులను పాటించి, నీటి వినియోగాన్ని సమర్ధంగా చేపట్టాలని, భూసార పరీక్షలు క్రమంగా చేసుకోవాలని చీడపీడల యాజమాన్యం చేపట్టాలని, విత్తనానికి అవసరమైన చోట మాత్రమే దున్నాల‌ని, నేలను కప్పి ఉంచే పద్ధతిని అనుసరించాలని పంట మార్పిడి చేసుకోవాలని అంతర్ పంటలు వేసుకోవాలని, మిత్ర పంటలు వేసుకోవాలని సాగు విధానాల కొనసాగింపుతో నేల కోతను అరికట్టుకోవాలని, వ్యవసాయ పంటలు అటవీ మొక్కలను సంయుక్తంగా ఒకే పొలంలో సాగు చేయాలని ఏఈఓ నాగార్జున రైతుల‌కు సూచించారు

రైతులకు అవగాహన కోసం పెద్ద మాసనపల్లి గ్రామ రైతులకు ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజర్ కిడ్స్, స్టిక్కర్స్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దమాసంపల్లి గ్రామ ప్రజలు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు.

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

By admin