హైదరాబాద్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ – హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, డిసేబుల్ ట్రస్ట్, బద్రీ విశాల్ పానలాల్ పిట్టి ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్, మహావీర్ వికలాంగ సహాయత సమితి, డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్, రామదేవ్ రావు హాస్పిటల్, జనజాగృతి ట్రస్టుల సహకారంతో ఉచిత మెగా శస్త్రచికిత్స & వైద్య శిబిరం సోమాజిగూడలోని సంస్కృతి రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై, వికలాంగులకు ఎలక్ట్రిక్ వెహికల్స్, కర్రలు, కేలిపర్స్, కృత్రిమ అవయవాలు, వాకర్స్, వీల్‌చెయర్స్లను పంపిణీ చేశారు.
రాష్ట్ర మంత్రి శ్రీ అడలూరి లక్ష్మణ్, హైదరాబాద్ కలెక్టర్ హరీచందనా ప్రత్యేక అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని అలంకరించారు.
ఈ సందర్భంలో డిసేబుల్ చైర్మన్ వీరయ్య, రెడ్ క్రాస్ స్టేట్ సీఈఓ శ్రీరాములు, ఎమ్మెల్యే కలా యాదయ్య, రెడ్ క్రాస్ ఛైర్మన్ భీమ్ రెడ్డి, ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ కీర్తనా యాదవ్ (ఫౌండర్, డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్) శిబిరం నిర్వహణలో, వైద్య బృందాన్ని సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వికలాంగులను వివిధ ప్రాంతాల నుండి మోబిలైజ్ చేయడంలో గంగారాం (FED సంస్థ), శ్రీనివాస్ (వికలాంగుల నెట్‌వర్క్), నామ నాగేశ్వర్, కిరణ్ గుటికొండ విశేష కృషి చేశారు. అలాగే రెడ్ క్రాస్ బృందంలోని విజయ, అనురాధ తమ శ్రద్ధతో సేవలందించారు.
ఈ శిబిరం యొక్క ప్రధాన థీమ్ – “వికలాంగులను సకలాంగులు చేయడం”.
ఈ శిబిరంలో 900 మందికి పైగా వికలాంగులు లబ్ధి పొందగా, వారిలో 71 మంది శస్త్రచికిత్సకు ఎంపికయ్యారు.
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ వికలాంగుల పునరావాసం, వినోదం మరియు క్రీడల ప్రాధాన్యంను ప్రస్తావించారు.
మంత్రి అడలూరి లక్ష్మణ్ మాట్లాడుతూ వికలాంగుల అభివృద్ధి కోసం తగిన నిధులు సమకూరుస్తానని, సహాయ చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.
ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ వికలాంగుల లోపాలను సరిచేయడంలో మైక్రోసర్జరీ ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమం ముగింపు సందర్భంగా రాజ్ భవన్ బృందానికి హాల్ అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు, మీడియా ప్రతినిధులకు శిబిరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/

https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/
https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/