HYDERABAD (MediaBoss Network):
తెలంగాణ బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని టీ-పీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 లో టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. గత ఎనిమిదిన్నర ఏళ్లలో 1700 మంది తెలంగాణ వలస కూలీలు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందారు, ఇందుకు శంషాబాద్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ లో శవపేటికల రిజిస్టర్ సాక్ష్యం అని సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన కోరారు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన కార్మికుల పునరావాసం, పునరేకీకరణ గురించి ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టాలని, సమగ్ర ఎన్నారై పాలసీలో భాగంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ఏటా రూ.18 వేల కోట్ల విదేశీ మారకం
ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున ప్రతినెలా 1,500 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారని టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బి. ఎం. వినోద్ కుమార్ అన్నారు. ఈ విధంగా ఏడాదికి 18 వేల కోట్ల రూపాయల చొప్పున గత ఎనిమిదిన్నర ఏళ్లలో ఒక లక్ష 53 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు చేరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడిందని ఆయన అన్నారు.

ఈ డబ్బు వినియోగంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గత ఎనిమిదిన్నర ఏళ్లలో 15 వేల 300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని వినోద్ కుమార్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారకం రూపంలో, రాష్ట్రానికి పన్నుల రూపంలో గల్ఫ్ కార్మికులు మేలు చేస్తున్నారు. ఎడారి ఎండలో తమ చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మును స్వదేశానికి పంపిన వలస కూలీల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని జగిత్యాల జుల్లా కాంగ్రెస్ కార్యదర్శి గోపిడి ధనుంజయ రెడ్డి అన్నారు.

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews