- మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహణ
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో డాక్టర్ సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠె 105వ జయంతి వేడుకలు మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నాభావు సాఠె చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన టీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జంపాల రాజేష్ మాట్లాడుతూ, “పాఠశాలకూ వెళ్లకుండా, ఏకలవ్యుడిగా స్వయంగా చదువుకుని ప్రపంచ ప్రఖ్యాతిని సంపాదించిన అన్నాభావు సాఠె, ప్రతీ యువతకి ఆదర్శం. ఆయన సాహిత్యం సామాజిక చైతన్యానికి మార్గదర్శకం. ఉస్మానియా విద్యార్థులు ఆయన రచనలను అధ్యయనం చేసి, సమాజంలో వెలుగులోకి తేవాలన్నారు.”
మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంబ్లే శంకర్ మాంగ్ మాట్లాడుతూ —
“మాంగ్ కులానికి తహసీల్దార్ కార్యాలయం ద్వారా వెంటనే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి. వెనుకబడిన మాంగ్ సమాజ అభివృద్ధికి ప్రత్యేక మాంగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మాంగ్ విద్యార్థులకి గురుకులాల్లో ప్రత్యేక సీట్లు కల్పించాలి. అలాగే ఏజెన్సీల్లో నివసించే మాంగ్ రైతులకు పాత పహాణీ ఆధారంగా వ్యవసాయ సంబంధిత అన్ని ప్రభుత్వ లబ్ధులు కల్పించాలి,” అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వి ప్రధాన కార్యదర్శి డా. చందు, మాంగ్ సమాజ్ నాయకులు అమృతం కళ్యాణ్, జంపాల రాంబాబు, వెంకట్, సతీష్, శేఖర్, విజయ్, సాయికిరణ్, విక్రమ్, గాయక్వాడ్ చంద్రశేఖర్ మాంగ్ (రాష్ట్ర సంయుక్త కార్యదర్శి), హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు కె. సుధాకర్ మాంగ్ ప్రధాన కార్యదర్శి ఎస్. దిలీప్ మాంగ్, సిఎచ్. ఉద్ధవ్ మాంగ్, కె. అనిల్ మాంగ్, ఎన్. సాయి మాంగ్, తో పాటు మహిళలు, విద్యార్థులు, మాంగ్ సమాజ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వేడుకలు మాంగ్ సమాజం సామాజిక చైతన్యానికి ప్రతిబింబంగా నిలిచాయని, ఆలోచనలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే యువతరం ఈ కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి పొందుతుందని నాయకులు తెలిపారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/

https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/
https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/