పుట్టిన ఊర్లో బతుకుదెరువు లేదు.. ఆక‌లి క‌ష్టాలు, ఆర్థిక క‌ష్టాలు చుట్టుముట్టాయి.. జీవితాంతం తోడుగా ఉంటుంద‌నుకున్న భార్యను పేద‌రికం కాటేసింది. అక్క‌డితో ఆగిపోలేదు. తండ్రిని కూడా బ‌లి తీసుకుంది ఆ పాప‌పు పేద‌రికం. అక్క కూడా పుట్టుక‌తోనే మాన‌సిక విక‌లాంగురాలు.. క‌ష్టాల‌కు తోడుగా అప్పులు మ‌రింతా స‌త‌మ‌తం చేస్తున్నాయి. బ‌తుకు మారుతుంద‌ని ఎడారి దేశంలో అడుగుపెడితే జీవిత‌మే బుగ్గిపాలు అయింది. పుట్టిడు దుఃఖ‌మే మిగిల్చింది. త‌నువు చాలించిన మ‌రో గ‌ల్ఫ్ బాధితుడి విషాద‌క‌ర ఘ‌ట‌న ఇది.

– తెలంగాణ‌లో గ‌ల్ఫ్ బాధితుల జీవితాలు విషాదాంతంగా ముగుస్తున్నాయి.  జ‌గిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన 36 ఏళ్ల‌ జుపాక గణేష్ క‌న్నీటి క‌థ ఇది. ఐదు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం అప్పు చేసి దుబాయ్ వెళ్ళాడు. అక్క‌డి కంపెనీలో సరైన జీతాలు లేక బ‌య‌ట‌కు వెళ్లి కూలీ ప‌నుల‌కు సిద్ధ‌మ‌య్యాడు. కానీ బయట పనులు దొరకక చేతిలో చిల్లిగవ్వలేక ఉండడానికి రూమ్ లేక తినడానికి తిండి లేక ఎడారి ప్రాంతంలో ట్రక్కుల కింద తలదాచుకుంటూ చివరికి అడుక్కు తినే పరిస్థితి ఎదురయ్యింది. పస్తులుండాల్సిన ప‌రిస్థితి ఎదుర్కొన్నాడు. ఇంటి ద‌గ్గ‌ర అప్పుల బాధ‌లు ఉన్నాయి. గ‌తంలో గణేష్ ఇండియా లో ఉన్నప్పుడు భార్య లావణ్య అనారోగ్యంతో అస్ప‌త్రిలో చూపించుకోలేని పరిస్థితితో మృతి చెందింది. దానికి తోడుగా గణేష్ దుబాయ్ లో ఉండగానే తండ్రి కొండయ్య కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి చివరి చూపుకుకూడా నోచుకోలేదు. ఒక అక్క కూడా పుట్టుక‌తోనే మానసిక వికలాంగురాలు. గణేష్ కు ఒక కొడుకు నితీష్ 8 సంవత్సరాలు తల్లి రోజు కూలికి పోతేగాని పొట్టగడవని పరిస్థితి ఇవన్నీ ఆలోచించి ఇటు రాలేక అక్కడ ఉండలేక మానసికంగా కృంగిపోతు రోజు రోజుకు ఆరోగ్యం క్షిణించిపోయింది. ఒక‌రోజు సముద్రం ఒడ్డున అనుమానాస్పదంగం సృహ కోల్పోయి పడిపోయిన గణేష్ ను గ‌త నెల డిసెంబ‌ర్ 15న అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికులు అంబులెన్స్ కి కాల్ చేసి జెబా లాలి హాస్టర్ హాస్పిటల్లో చేర్చారు. గణేష్ వారం రోజులపాటు కోమాలోనే ఉన్నాడు. చివ‌రికి డిసెంబ‌ర్ 22న హాస్పిటల్ లోనే క‌న్నుమూశాడు.

గ‌తంలో గ‌ణేష్ పరిస్థితిని తెలుసుకున్న గల్ఫ్ జేఏసీ చైర్మ‌న్ దుబాయ్ ఎల్లాల శీనన్న సేవ సమితి అధ్యక్షులు ఉట్నూరి రవికి ఫోన్ చేసి వివరించగా సంఘ సభ్యులు రవి డేవిడ్, చిలుముల రమేష్ గణేష్ ని నాలుగు రోజులపాటు వెతుక‌గా ఎడారిలో ఎర్రటి ఎండలో ఓ ట్రక్ కింద తలదాచుకొని ఉండగా అతన్ని తీసుకుపోయి భోజన సౌకర్యం, బట్టలు దుప్పట్లు కొనిచ్చి సంవత్సరం పాటుగా అతన్ని కాపాడుకుంటూ ఇండియాకి పంపించేందు దాదాపు 3500 రూపాయలు ఖర్చు పెట్టి కుడ్రాక్మెంట్స్ ఔట్ పాస్‌పోర్ట్ తయారు చేసించి ప్రయత్నాలు చేయగా గణేష్ మానసిక పరిస్థితి బాగలేక మళ్ళీ ఎటో వెళ్ళిపోయి.. చివ‌రికి హ‌స్పిట‌ల్‌లో క‌న్నుమూశాడు.

మృతుని శవపేటికతో నిర‌స‌న‌

గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గల్ఫ్ మృతుని శవపేటికతో మేడిపల్లి మండల కేంద్రంలోని జగిత్యాల – నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు 500 కోట్ల రూపాయలతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటూ, గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రెసియా వెంటనే అందించాలని గల్ఫ్ JAC నాయకులు డిమాండ్ చేశారు.

గణేష్ మృత దేహన్ని ఇంటికి తీసుకురావ‌డానికి దుబాయ్ లో ఉన్న JAC నాయకులు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నర్సింహ తో గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవి గౌడ్, రవి డేవిడ్ మాట్లాడగా ఆయన మృతదేహాన్ని తెప్పించడం ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించి తెప్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ జేఏసీ చైర్మైన్ గుగ్గిల్ల రవి గౌడ్ TPCC NRI సెల్ గల్ఫ్ కన్వీనర్ నరేష్ రెడ్డి, భారతీయ జాతపార్టీ మేడిపల్లి మండల ఉపాధ్యక్షులు తోగరి లక్ష్మీపతి, నీలం గంగాధర్, CPI మండల ఆధ్యక్షులు హన్మంత్, ఉర్మాట్ల లక్ష్మణ్ కల్లెడ వినయ్ గల్ఫ్ జేఏసీ నాయకులు, మృతుని కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

ఇలాంటి క‌న్నీటి గాథ‌లు తెలంగాణ‌లో ఎన్నో.. వీటికి ఇంకా ముగింపు లేదా? పాల‌కుల‌కు ఈ ఆర్త‌నాదాలు వినిపించ‌వా? ఈ విషాదాలు క‌నిపించ‌వా? ఇంకా ఎన్నాళ్లు ఈ ప్ర‌భుత్వం మౌనంగా ఉంటుంది? గ‌ల్ఫ్ బాధితుల‌ను ఆదుకునే వ‌ర‌కు మ‌న పోరాటం కొన‌సాగిద్దాం!
– SWAMY MUDDAM, CEO, BREAKINGNEWS TV & APP (MediaBoss Network)

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin