కెరీర్‌లో హిట్ కోసం ఎదురుచూస్తున్న నాని.. మరిసారి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’.. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సౌత్ సినిమాలపై సల్మాన్ ఫోకస్.. మరో మెగా హీరోతో మూవీ.. కథ విషయానికి వస్తే.. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సుందరం బాల్యం నుండే పద్ధతులు, కట్టుబాట్ల మధ్య పెరుగుతాడు. ఈ క్రమంలో తను కోరుకున్న జీవితాన్ని, చిన్నచిన్న ఆనందాల్ని కోల్పోతాడు. అంతేకాదు సుందరానికి చిన్నప్పటినుండి అమెరికా వెళ్లాలనే కోరిక ఉంటుంది. దానికి కూడా తండ్రి ఆచారాల పేరుతో అడ్డుపడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే సుందరానికి లీలా థామస్ పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. లీలా క్రిస్టియన్ కావడంతో.. ఆమె పేరెంట్స్ మతపరమైన నమ్మకాల పట్ల చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. రెండు భిన్న మతాలకు చెందిన సుందరం, లీలా పెద్దలను ఒప్పించి తమ ప్రేమను ఎలా పెళ్ళిదాకా తీసుకెళ్ళారు? అబ‌ద్దాల‌తో పేరెంట్స్ ను ఒప్పించాల‌ని ఎలాంటి చిక్కుల్లో ప‌డ‌తారు అనేదే మిగతా సినిమా.

కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు దాన్ని ప్రెసెంట్ చేసిన విధానం కొత్తగా ఉంది. ఓ రొటీన్ కథకు దర్శకుడు వివేక్ రాసుకున్న స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. ఆ విషయంలో దర్శకుడు ఫుల్ గా సక్సెస్ అయ్యాడు. ఇక సుందర్ పాత్రలో నాని నటన సినిమాకి హైలెట్ అని చెప్పాలి. కట్టుబాట్ల మద్య పెరిగిన యువకుడిగా నాని అద్బుతమైన నటనని కనబరిచాడు. లీలా పాత్రలో నజ్రియా క్యుట్ గా కనిపించి ఆకట్టుకుంది. నాని, నజ్రియా మధ్య వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఫుల్ గా ఆకట్టుకుంటాయి. ఇక వివేక్ సాగర్ అందించిన పాటలు సో సో గా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. కెమెరా వర్క్, ఆర్ట్ వేర్క్ కూడా సినిమా మూడ్ కి తగ్గట్టుగా ప్లేసేంట్ గా ఉందని చెప్పాలి. అయితే సినిమా రన్ టైం ఎక్కువగా ఉండటం అనేది చిన్న డ్రాబ్యాక్ అనే చెప్పాలి. చిన్న‌క‌థ‌ను బాగా లాగిన‌ట్టు కూడా అనిపిస్తుంది. అక్క‌డ‌క్క‌డ బోర్ కొట్టిస్తుంది.

రొమాంటిక్ కామెడీ సినిమాలు అంటేనే కథ కొత్తగా ఉండాలి లేదా స్క్రీన్ ప్లే లో అయినా కొత్తదనం ఉండాలి. కొన్ని చోట్ల కథ సింపుల్ గానే అనిపించినప్పటికీ వివేక్ ఆత్రేయ తన స్టైల్ ఆఫ్ నెరేషన్ తో కథను చాలా బాగా మలిచారు. తన ముందు సినిమాల లాగానే ఈ సినిమాను కూడా ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు వివేక్ ఆత్రేయ. ముఖ్యంగా చాలా పాత్రల విషయంలో డైరెక్టర్ డీటైలింగ్ బాగుంటుంది. సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ప‌ర‌వాలేదు. అనిపిస్తుంది. ప్ల‌స్ పాయింట్స్ చూస్తే… నటీనటులు ఎంటర్టైన్మెంట్ కామెడీ సన్నివేశాలు నేపథ్య సంగీతం. మైన‌స్ పాయింట్స్ చూస్తే… కొన్ని స్లో సన్నివేశాలు సెకెండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉండటం.

ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల ఇంట్రడక్షన్, కథ ఎస్టాబ్లిష్ చేయడం, స‌ర‌దా సన్నివేశాలతో అయిపోతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లోని లోని కొన్ని సన్నివేశాలు మాత్రం కొంచెం బోరింగ్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా నాని కుటుంబ సభ్యులతో వచ్చే సన్నివేశాలు కొంచెం విభిన్నంగా తీర్చిదిద్దారు. క్లైమాక్స్ ను కూడా హడావిడిగా కాకుండా అన్ని పాత్రలకు ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. ఓవరాల్ గా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ, కామెడి ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కాస్త రిలాక్స్ చేస్తుంద‌నే చెప్పాలి.

రేటింగ్ 2.5/5 

ఎప్ప‌టిక‌ప్పుడు బ్రేకింగ్‌న్యూస్ అప్‌డేట్స్ కోసం
BREAKINGNEWS APP డౌన్‌లోడ్ చేసుకొండి.

 

 

By admin