ముస్తాబాద్ మండల రైతులకు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) సంస్థ ఆధ్వర్యంలోని జై కిషన్ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. వరి కొయ్యలు కాల్చొద్దంటూ సూచించింది. రైతులకు సింగల్ సూపర్ ఫాస్పేట్, వేస్ట్ డీకంపోజర్ కిట్స్ ఉచితంగా అందించారు.
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) సంస్థ నాయకులు రైతులకు అవగాహన కల్పిస్తూ.. వరికొయ్యలను కాల్చితే నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని, కాల్చడం ద్వారా విపరీతమైన వేడితో భూమిసారాన్ని కోల్పోతుందని అన్నారు. ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది. ముఖ్యంగా పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, రైతుమిత్ర పురుగులు నశిస్తాయి. దీంతో పంట దిగుబడి సరిగా రాదు. భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయి. పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి. పొలాల్లో తిరిగే పాములు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. పొలాల గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కాలిపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాల దగ్గరే ఉన్న ధాన్యం కాలిపోయి ప్రమాదమూ ఉందంటూ రైతులకు అవగాహన కల్పించారు.
హార్వెస్టర్‌తో వరి కోసేటప్పుడు వీలైనంత కింద నుంచి వరి కోయడం వల్ల వరి గడ్డి పశువులకు ఉపయోగపడుతుందన్నారు. రైతులు కోపరేటివ్ సొసైటీ ద్వారా మార్కెట్లో లభించే ప్యాడి ట్రషర్ యంత్రాన్ని కొనుకొచ్చి వరి కొయ్యలను పొడిగా మారిస్తే భూమి కూడా సారవంతం అవుతుందని టీడీఎఫ్ – ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కి ఆర్థిక సాయం అందిస్తున్న టీడీఎఫ్ – యూఎస్ఏ మాజీ చైర్మన్ టీఆర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కొండం రాజిరెడ్డి రైతులకు సూచించారు. రానున్న రోజుల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు ముస్తాబాద్ మండల రైతులకు నిర్వహిస్తామని తెలిపారు.
బదనకల్ ఉత్తమ రైతు చిగురు నరేష్ మాట్లాడుతూ.. ఈ ఎస్ఎస్పీ, వేస్ట్ డీకంపోజర్ ఏ విధంగా వాడాలో రైతులకు క్లుప్తంగా వివరించారు. రైతులు తమకు కావలసిన ఏ విధమైన సమాచారం కావాలన్నా, రైతులు వారి గ్రామానికి సంబంధించిన అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ సంప్రదించాలని ఏవో అనుష రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పోత్కల్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ తలారి రాణి, వైస్ చైర్మన్ వెలుముల రామిరెడ్డి, మాజీ సర్పంచ్ కిషరావ్, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి, గజ్జల రాజు ముస్తాబాద్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అనూష, 16 గ్రామాలకు సంబంధించిన అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. కీర్తన, సౌమ్య, రేవతి, అఖిల, వెంకటేష్, నరేష్, ముస్తాబాద్ మండల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/