చిత్రం: బహిర్భూమి

నటీనటులు: నోయెల్ సేన్, రిషిత నెల్లూరు, గరిమ సింగ్, చిత్రం శీను, ఆనంద భారతి, విజయరంగరాజు, జబర్దస్త్ ఫణి తదితరులు

సంగీతం: అజయ్ పట్నాయక్

సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కొమరి

ఎడిటింగ్: రంగస్వామి

నిర్మాత: వేణుమాధవ్ మచ్చ

రచన- దర్శకత్వం: రాంప్రసాద్ కొండూరి

విడుదల తేదీ: 4-10-2024

నోయల్ హీరోగా రాంప్రసాద్ కొండూరి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘బహిర్భూమి’. టాయిలెట్ పేరు మీద సినిమా వచ్చింది కానీ.. అచ్చ తెలుగులో ఇలా ‘బహిర్భూమి’ అంటూ టైటిల్ పెట్టడంతో ఈ సినిమా ఏదో కొత్త విషయాన్ని చెబుతుందనే ఫీల్‌ని టైటిల్‌తోనే ఇచ్చారు మేకర్స్. రిషిత నెల్లూరు, గరిమా సింగ్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇందులో నోయల్ సెన్ గ్రామీణ నేపథ్యంలో ఒక వైవిద్యమైన పాత్రను పోషించాడు. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందామా..

 

కథ:

నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతలోని ఊరు దేవరపల్లి ఆ ఊరిలో బహిర్భూమికి వెళ్ళే ప్రదేశంలో వరసగా హత్యలు జరగడంలో కథ మొదలవుతుంది. మరో వైపు కృష్ణ (నోయెల్) చాలా రోజుల నుంచి గౌరినీ లవ్ చేస్తూ ఉంటాడు కానీ కొన్నికారణాల వల్ల తనకి ఆ విషయం చెప్పలేకపోతాడు. తన మరదలు లీల (గరిమాసింగ్) కృష్ణని లవ్ చేస్తుంది. ఈ హత్యలలో ఆ ఊరిలో ఒక పెద్ద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు చనిపోతారు. ఆ కుటుంబం పెద్ద దేవ (కిరణ్ సాపల)కి హత్యలు చేసే వ్యక్తి ఎవరో తెలుసుకొని అతనినీ చంపడానికి బయలు దేరతాడు. చివరికి కృష్ణ తన ప్రేమ విషయం గౌరీకి చెప్పాడా లేదా? ఊరిలో హత్యలు చేసేది ఎవరు ? హత్యలు ఎందుకు చేస్తున్నారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ మూవీలో అన్ని పాత్రలు కూడా బాగా చేశారు. హీరో నోయల్ ఇలాంటి పాత్ర ఫస్ట్ టైం చేసినప్పటికీ కృష్ణ అనే పాత్రలో ఒదిగి పోయారు. ఈ సినిమాలో కామెడీ అంతంత మాత్రంగానే వుంది. ఫస్టాఫ్ బాగా ఎంగేజ్ చేస్తుంది కానీ.. టైటిల్‌కి, సినిమా ఉన్న కథకి పెద్దగా కనెక్షన్ కుదరలేదని అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ స్లోగా వెళ్లినట్టు అనిపిస్తుంది. చివరి 20 నిమిషాలే ఈ సినిమాకు ప్రాణం. అజయ్ పట్నాయక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. Dop ప్రవీణ్ విజువల్ చాలా బాగా ఇచ్చాడు. డైరెక్టర్ స్టోరీలో తడబడ్డా.. క్లైమాక్స్‌తో మెప్పిస్తాడు. ఓవరాల్‌గా అయితే సినిమా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఖాళీగా ఉంటే.. ఓసారి అలా లుక్కేసి రావచ్చు.

బలాలు:

మ్యూజిక్

విజువల్స్

నోయల్ నటన

క్లైమాక్స్

 

బలహీనతలు:

సెకండాఫ్‌లో ఫస్ట్ 30 నిమిషాలు

కొరవడిన హాస్యం

 

చివరగా: బహిర్భూమి.. ఏదో అనుకుంటే ఏదేదో అయింది

రేటింగ్: 2.5/5

By admin