దమ్మాం: తెలంగాణ పూల పండగ బతుకమ్మ, దసరా పండగలు ఎడారి దేశాల్లోనూ ఘనంగా జరిగాయి. భారతీయ సంప్రదాయం, సనాతన ధార్మిక విలువల పరిరక్షణలో ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉండే సౌదీ అరేబియాలోని దమ్మాం ప్రాంతంలోని తెలుగు ప్రవాసీయులు ఇటీవల దసరా, బతుకమ్మ వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.
దసరా పండుగ ఉత్సవాన్ని, కార్యక్రమ సమన్వయకర్త విశాల్, పవిత్ర దంపతుల అన్నీ తామై అందరి సహకారంతో ప్రవాసీ సంఘం ‘సాటా దమ్మాం’ ఆధ్వర్యంలో నిర్వహించారు. నవ దుర్గలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన అనంతరం దుర్గాదేవి అమ్మవారికి విజయ కిశోర్, లీలా అరవింద్‌లు చేసిన అలంకరణ చూడముచ్చటగా భక్తులను ఆకట్టుకుంది.
అమ్మవారి ఊరేగింపు మొదలు కుంకుమ పూజలో మహిళా విభాగం అధ్యక్షురాలు సంధ్య గౌరి శంకర్ మహిళలను సమన్వయం చేశారు. చిన్నారులు చేసిన నవ దుర్గ స్కిట్లు అందర్నీ ఆకట్టుకోగా దీన్ని వర్షిత, సౌజన్య, దిలీప్, ప్రియా సుబ్బులు సమన్వయం చేసారు. రామ, లక్ష్మణ, సీతా దేవిల అలంకరణలను భారతీ, జయశ్రీ, అరవింద్‌లు చేసారు. రావణాసురుడి దహనం చేసే సన్నివేశం కూడా అందర్నీ ఆకట్టుకోగా దీనికి విశాల్ దర్శకత్వం వహించారు. అదే విధంగా, వివిధ రకాల పువ్వులతో చేసిన బతుకమ్మలను సతీశ్ కుసుమాంజలి, రాజేశ్, శ్రవణ్, కవితలు పేర్చి గౌరమ్మ పూజ నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సభికులందరికీ సాటా దమ్మాం అధ్యక్షుడు పల్లెం తేజ కృతజ్ఞతలు తెలిపారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/