పాపులారిటీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో 5 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు 6వ సీజన్ కు సిద్ధం అవుతుంది. గత సీజన్ 5 లో సన్నీ బిగ్ బాస్ కప్ అందుకుని అందరిని ఆశ్చర్యపరచగా షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు. క సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా పూర్తి అవ్వడంతో ఇప్పుడు సీజన్ 6 కూడా స్టార్ట్ చేయబోతున్నారు నిర్వాహకులు. మధ్యలో బిగ్ బాస్ ఓటిటి తో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇప్ప‌టికే బిగ్‌బాస్ సీజ‌న్‌కి కంటెస్టెంట్స్ ఎంపిక‌య్యారు. వారి గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టు

నెంబర్ – 1
ఎప్పటినుంచో వినిపిస్తున్న పేరు శ్రీహాన్. సిరి బాయ్ ఫ్రెండ్ గా సీజన్ 5లో నాగార్జునతో స్టేజ్ షేర్ చేసుకున్నప్పటి నుంచీ సీజన్ 6లో కన్ఫార్మ్ అయిపోయాడు మనోడు. ఈసారి శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్ 6లో కన్ఫార్మ్ అయినట్లే.

నెంబర్ – 2
ఆది రెడ్డి. బిగ్ బాస్ షోలని యుట్యూబ్ లో రివ్యూస్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, తనదైన స్టైల్లో ఛారిటీ చేస్తూ సెలబ్రిటీలకి ట్వీట్స్ చేస్తూ కూడా సక్సెస్ అయ్యాడు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఫాలోవర్స్, యూట్యూబ్ లో కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యాడు. అందుకే ఈసారి బిగ్ బాస్ సీజన్ 6కి సెలక్ట్ అయ్యాడు. ఉడాల్ అనే పదాన్ని సోషల్ మీడియాలో ఫేమస్ చేసిన ఆదిరెడ్డి ఈసారి బిగ్ బాస్ లో ఎలాంటి గేమ్ ఆడబోతున్నాడు అనేది ఆసక్తికరం.

నెంబర్ – 3
చలాకీ చంటి. చలాకీ చంటి పేరు తెలియని వాళ్లు అంటూ ఉండరు. జబర్ధస్త్ షోలో మంచి ఫేమ్ తెచ్చుకున్న చంటి చాలా సినిమాల్లో నటించాడు కూడా. సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోవర్స్ లేకపోయినా, టెలివిజన్ లో మాత్రం చంటికి ఫ్యాన్స్ ఎక్కువ. నాఇష్టం అనే షో ద్వారా కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. మరి ఈసారి బిగ్ బాస్ లో ఎలాంటి పెర్ఫామన్స్ ఇస్తాడో చూడాలి.

నెంబర్ – 4
పటాస్ ఫైమా. జబర్ధస్త్ షో చేస్తున్నా కూడా పటాస్ ఫైమాగానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఛేంజర్ అవుతుందా ? లేదా అందరినీ ఒక ఆట ఆడుకుంటుందా అనేది చూడాలి.

నెంబర్ – 5
సింగర్ రేవంత్. సింగర్ రేవంత్ తెలియని మ్యూజిక్ లవర్స్ ఉండరేమో. ఎందుకంటే, ఇండియన్ ఐడియల్ కి వెళ్లాక మనోడి క్రేజ్ నేషనల్ లెవల్లో పెరిగిపోయింది. అదిరిపోయే సాంగ్స్ పాడగలిగిన సత్తా ఉన్న ఈ వైజాగ్ కుర్రాడు బిగ్ బాస్ హౌస్ లో ఈసారి అందరికీ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తాడు.

నెంబర్ – 6
యాక్టర్ సుదీప. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తీ అగర్వాల్ చెల్లిగా, ఆతర్వాత మంచి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది పింకీ అలియాస్ సుదీప. అసలు పేరు కంటే కూడా పింకీగానే తెలుగు ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయింది. నువ్వే నువ్వే సినిమాలో, బొమ్మరిల్లు సినిమాలో హీరోకి చెల్లిగా కూడా యాక్ట్ చేసింది. అంతేకాదు, కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. అలాగే యాడ్స్ లో కూడా యాక్ట్ చేసింది. మరి ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి సవాళ్లని ఎదుర్కుంటుందో చూడాలి.

నెంబర్ – 7
ఆర్టిస్ట్ శ్రీ సత్య. ఇప్పుడిప్పుడే ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది శ్రీసత్య. టివి సీరియల్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ముద్ద మందారం సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించింది.

నెంబర్ – 8
వసంతి కృష్ణన్. ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అవుతోంది. పండుగాడ్ అనే సినిమాలో యాక్ట్ చేసింది. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆల్రెడీ నాలుగు కన్నడ సినిమాలు చేసిన ఈ అమ్మడు స్టార్ మా లో రెండు మూడు సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసింది. సిరి సిరి మువ్వ, గోరింటాకు సీరియల్స్ ఫాలో అయ్యే వారికి బాగా సుపరిచితురాలు.

నెంబర్ – 9
హీరో అర్జున్ కళ్యాణ్. హీరోగా, యాక్టర్ గా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు అర్జున్ కళ్యాణ్. చిన్న బడ్జెట్ సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. నా గర్ల్ ఫ్రెండ్, మిస్సమ్మ, నారీ నారీ నడుమమురారి, బొమ్మ అదిరింది, అలాగే ప్లే బ్యాక్ అనే సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. చాలా అందంగా ఉంటాడు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6లో ఎలాంటి ఫైట్ ఇస్తాడు అనేది చూడాలి.

నెంబర్ – 10
మాస్టర్ భరత్. చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికీ బాగా పరిచయం. ఎబిసిడి సినిమాలో అల్లు శిరీష్ తో కలిసి యాక్ట్ చేశాడు. ఇప్పుడిప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6లో ఎలా ఉంటాడు అనేది చూడాలి.

నెంబర్ – 11
యాంకర్ ఆరోహి రావ్. టివి – 9 నుంచీ ఎప్పుడు బిగ్ బాస్ లోకి ఎవరో ఒకరు వస్తునే ఉంటారు. ఈసారి ఇస్మార్ట్ న్యూస్ చదివే యాంకర్ అంజలి రాబోతోందని సమాచారం. ఇస్మార్ట్ అంజలిగానే తెలుగు ప్రేక్షకులని బాగా పరిచయం అయిన ఈమె పేరే ఆరోహి రావ్.

నెంబర్ – 12
ఆర్టిస్ట్ సుల్తానా. ఆర్జీవి బర్త్ డే పార్టీలో ఫేమస్ అయిన అమ్మాయి. అలాగే యాంకర్ గా కూడా ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుతోంది. మోడల్ గా కెరియర్ ని ప్రారంభించిన సుల్తానా చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది.

నెంబర్ – 13
యాంకర్ దీపిక పిల్లి. ఢీ షో ద్వారా దీపిక పిల్లి తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచుతురాలు. నిజానికి లాస్ట్ సీజన్ లోనే దీపిక పిల్లికి ఆఫర్ వచ్చింది. కానీ , కొన్ని కారణాల వల్ల షోకి రాలేకపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6లోకి అడుగు పెట్టబోతోంది. మరి గేమ్ ఎలా ఆడుతుంది అనేది ఆసక్తికరం.

నెంబర్ – 14
జబర్ధస్త్ టీమ్ నుంచి ట్రాన్స్ జెండర్ గా తన్మయి ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతోంది. జబర్ధస్త్ షోలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరుని సంపాదించుకుంది తన్మయి.

నెంబర్ – 15
గీతురాయ్. యాంకర్ గా, యూట్యూబర్ గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపుని తెచ్చుకుంది. బిగ్ బాస్ షోని రివ్యూస్ చేస్తూ, అలాగే సెలబ్రిటీలని ఇంటర్య్వూస్ చేస్తూ యూట్యూబ్ లో ఫేమస్ అయ్యింది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపేట్ చేయబోతోంది.

నెంబర్ – 16
బజర్ధస్త్ నుంచీ అప్పారావ్. ఈసారి అప్పారావ్ ని కూడా బిగ్ బాస్ హౌస్లోకి పంపించబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, ఈయన వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారా? లేదా లాస్ట్ మినిట్ లో డ్రాప్ అవుతారా అనేది సందేహంగానే ఉంది.

ఇక మరో ఇద్దరిని కామన్ మాన్ కేటగిరిలో కూడా తీస్కోబోతున్నారు. వాళ్లలో విజయవాడకి చెందిన శ్రీధర్, వరంగల్ కి చెందిన సంధ్య ఉన్నట్లుగా చెబుతున్నారు.

#BBLiveOnHotstar #DisneyPlusHotstar #BiggBossTelugu6

 

By admin