విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి పీవీ చలపతిరావు పార్థీవ దేహాన్ని ఇంటికి తరలించారు.

సీహెచ్ విద్యాసాగర్ రావు సంతాపం

హైద‌రాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు మరణం పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన చలపతిరావు తనకు మార్గదర్శకులని ఆయన అన్నారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. వారితో తాను కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాల‌ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఆనాటి జనసంఘ్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుల్లో చలపతిరావు ఒకరని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin