స్వాతి – న్యూజెర్సీ నుంచి కవరేజీ: మన బోనాల జాతర సంబురాలు ఖండంతరాలు దాటింది. తెలంగాణ సంస్కృతీ, ఆచార సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బోనాల జాతరను అగ్రరాజ్యం అమెరికాలోనూ ప్రవాసీయులు మొట్టమొదటి సారిగా ఘనంగా నిర్వహించుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) – సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం సంయుక్తంగా బోనాల జాతరను నిర్వహించారు. హైదరాబాద్ లాల్ దర్వాజ లష్కర్ బోనాలను మరిపించే విధంగా, న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్‌లో పోతురాజు నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఎడిసన్ ప్రాంతంలోని తెలుగు ఆడపడుచులు బోనమెత్తారు. అమ్మ వారిని మేళతాళలతో ఘనంగా స్వాగతించి, పూజలు సమర్పించి, తెలంగాణ – అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. సాయిదత్తాపీఠం చైర్మెన్ రఘుశర్మ శంకరమంచి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా MATA అధ్యక్షులు శ్రీనివాస గనగోని అందరికి బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో తొలిసారిగా బోనాలు చేయడం, ఘనంగా నిర్వహించుకోవడం సంతృప్తిని కలిగించిందన్నారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిరణ్ దుద్దగి (ED), విజయ్ భాస్కర్ కలాల్ (NC), శ్రీధర్ గుడాల (IVP), దాము గేదెల (గౌరవనీయ సలహాదారు), జైదీప్ రెడ్డి (గౌరవ సలహాదారు), కృష్ణశ్రీ గంధం (BOD), మహేందర్ నరలా (BOD), వెంకీ మస్తీ (RVP), కృష్ణ సిద్ధదా (RVP), రంగారావు మాడిశెట్టి (SC), గిరిజా మాదాసి (SC), మహిపాల్ రెడ్డి (Philly RVP), రాకేష్ కస్తూరి (RC), ప్రభాకర్ (RC), పూర్ణ (RC), శేషగిరిరావు (SC), శిరీషా గుండపనేని (SC) రఘు మడుపోజు (SC), దీపక్ కట్టా (SC), సురేష్ ఖజానా (RC), అశోక్ చింతకుంట, మాధవి సోలేటి తదితరులు పాల్గొన్నారు.
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
***
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp&hl=en-IN
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php