- దళిత బాధితులకు అన్యాయం జరుగుతోంది
- నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బైరి వెంకటేశం
చట్టాలను అమలు చేయవలసిన వారే వాటిని నిర్వీర్యం చేయడం దుర్మార్గమని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం దళితులపై దాడులు జరుగుతున్నాయని, దాడులకు పాల్పడిన వారినే రక్షిస్తూ బాధితులకు ఆన్యాయం చేసి ఈ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, బాధితులకు కనీసం నష్టరిహారాన్ని కూడా ఇవ్వడం లేదని బైరి వెంకటేశం ఆవేదన వ్యక్తం చేశారు. అట్రాసిటీ చట్ట పరిరక్షణకు జాతీయ స్థాయిలో NAPF అధ్వర్యంలో ఉద్యమిస్తామని అన్నారు.
హైదర్ గూడ మాలిక్ చాంబర్స్ BMP రాష్ట్ర కార్యాలయంలో ” నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్” ఆర్గనైజర్ ప్రొఫెసర్ B.S అస్తే (న్యూఢిల్లీ) అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొని ఎస్సీ ఉపకులాల ప్రజలపై జరుగుతున్న దాడులు, మన కులాలు ఎదుర్కొంటున్న వివక్షతపై మాట్లాడారు. ముఖ్యంగా దళితులందరు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని దీనికోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి అధ్వర్యంలో హైపవర్ కమిటీ వేయాలని, ప్రతి నెలా అన్ని జిల్లాలలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. చట్టాలను అమలు చేయవలసిన వారే వాటిని నిర్వీర్యం చేయడం దుర్మార్గమని వక్తలు అన్నారు. ప్రతిరోజూ ఈ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నప్పటికీ దాడులకు పాల్పడిన వారినే రక్షిస్తూ బాధితులకు ఆన్యాయం చేసి ఈ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, బాధితులకు కనీసం నష్టరిహారాన్ని కూడా ఇవ్వడం లేదని అన్నారు. అట్రాసిటీ చట్ట పరిరక్షణకు జాతీయ స్థాయిలో NAPF అధ్వర్యంలో ఉద్యమిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి,దళిత బహుజన ఫ్రంట్, బామ్సేఫ్, అంబేద్కర్ సంఘం, సోషల్ డెమోక్రటిక్ ఫోరం వివిధ సంఘాల నాయకులు మేధావులు పాల్గొన్నారు.